Vegame raavayyaa neevu velamdi dinadinamu

వేగమె రావయ్యా నీవు వెలఁది దినదినము
Language

(॥పల్లవి॥)
వేగమె రావయ్యా నీవు వెలఁది దినదినము
పోగులైన సంతోసాలు పోదిఁ బెట్టుకున్నది

(॥వేగ॥)
భామ చిగురాకుమోవిఁ బళ్లెము వెట్టుకున్నది
ప్రేమపు వలపు దొంతిఁ బెట్టుకున్నది
నేమవుఁ గోరికలెల్లా నీ కెదురంపు కున్నది
కామతంత్రములు వొడిఁ గట్టుకున్నది

(॥వేగ॥)
కప్పరపుఁ బలుకులు గాదెఁ బోసుకవున్నది
యెప్పడూ మనసు మీఁదెత్తుకున్నది
కప్పి జక్కవచన్నులు కానిక వట్టుకున్నది
దెప్పరపు సిగ్గునను తెరవేసుకున్నది

(॥వేగ॥)
కందువకాఁగిలి పాన్పుగాఁ బరచుక వున్నది
పొందుగ రతులు నీకుఁ బూఁచికున్నది
ఇందుకే వచ్చి శ్రీవేంకటేశ ఇంతిఁ గూడితివి
చెంది నవ్వు లింకా నీకు సేస వట్టుకున్నది

(||pallavi||)
vegamĕ rāvayyā nīvu vĕlam̐di dinadinamu
pogulaina saṁtosālu podim̐ bĕṭṭugunnadi

(||vega||)
bhāma sigurāgumovim̐ baḽlĕmu vĕṭṭugunnadi
premabu valabu dŏṁtim̐ bĕṭṭugunnadi
nemavum̐ gorigalĕllā nī kĕduraṁpu kunnadi
kāmadaṁtramulu vŏḍim̐ gaṭṭugunnadi

(||vega||)
kapparabum̐ balugulu gādĕm̐ bosugavunnadi
yĕppaḍū manasu mīm̐dĕttugunnadi
kappi jakkavasannulu kāniga vaṭṭugunnadi
dĕpparabu siggunanu tĕravesugunnadi

(||vega||)
kaṁduvagām̐gili pānpugām̐ barasuga vunnadi
pŏṁduga radulu nīgum̐ būm̐sigunnadi
iṁduge vachchi śhrīveṁkaḍeśha iṁtim̐ gūḍidivi
sĕṁdi navvu liṁkā nīgu sesa vaṭṭugunnadi