Veempu gaanaraamgaa daamge vidya lemtige

వీఁపు గానరాఁగా దాఁగే విద్య లేఁటికే
Language

(॥పల్లవి॥)
వీఁపు గానరాఁగా దాఁగే విద్య లేఁటికే
యేపున మా ముందర నీవెంతకెంత సేసేవే

(॥వీప॥)
చిమ్మిరేఁగ వలచిము సిగ్గువడనేమిటికే
వుమ్మడిఁ దొడమీఁదఁ గూచుందువుగాక
కొమ్మచేఁ బిలువనంపి కొంకుఁగొస రేఁటికే
లెమ్మని విభునిఁ గాఁగిలింతువుగాక

(॥వీప॥)
వొక్కపీఁట్టపై నుండి వొడ్డుకొననేఁటికే
చొక్కమైన మోవి చవిచూతువుగాక
పెక్కుసరసము లాడి బిగియఁగనేఁటికే
జక్కవచన్నుల నొత్తి సాదింతువు గాక

(॥వీప॥)
ఆసతోఁ బెండ్లాడి మరి యలయఁగ నేఁటికే
సేసవెట్టి రతుల మెచ్చింతువుగాక
లాసి నన్ను నేలినాఁ డలమేలుమంగను నేను
యీసరి శ్రీవేంకటేశు నెనతువుగాక

(||pallavi||)
vīm̐pu gānarām̐gā dām̐ge vidya lem̐ṭige
yebuna mā muṁdara nīvĕṁtagĕṁta seseve

(||vība||)
simmirem̐ga valasimu sigguvaḍanemiḍige
vummaḍim̐ dŏḍamīm̐dam̐ gūsuṁduvugāga
kŏmmasem̐ biluvanaṁpi kŏṁkum̐gŏsa rem̐ṭige
lĕmmani vibhunim̐ gām̐giliṁtuvugāga

(||vība||)
vŏkkabīm̐ṭṭabai nuṁḍi vŏḍḍugŏnanem̐ṭige
sŏkkamaina movi savisūduvugāga
pĕkkusarasamu lāḍi bigiyam̐ganem̐ṭige
jakkavasannula nŏtti sādiṁtuvu gāga

(||vība||)
āsadom̐ bĕṁḍlāḍi mari yalayam̐ga nem̐ṭige
sesavĕṭṭi radula mĕchchiṁtuvugāga
lāsi nannu nelinām̐ ḍalamelumaṁganu nenu
yīsari śhrīveṁkaḍeśhu nĕnaduvugāga