వీఁడివో నా రమణుఁడు వింటాఁ దానున్నవాఁడు
(॥పల్లవి॥)
వీఁడివో నా రమణుఁడు వింటాఁ దానున్నవాఁడు
పోఁడిమితోఁ జెలి నీవు పొంచి యెచ్చరించవే
(॥వీఁడి॥)
యెంచుకొంటే తన బత్తి యెంతైనా నాకుఁ గలదు
వంచెనతో మొక్కే మఱవకు మనవే
యించుకంత దడవైనా యెడయఁడు నన్నుఁ బాసి
మంచిదాయ యీమేలు మనసులోఁ బాయదే
(॥వీఁడి॥)
చూచుకొంటే తా నిచ్చిన సొమ్ములు నా మేన నివె
వేచందాలాఁ బొగడేను వినమనవే
కాచుకొని నాతోనే కాఁపురముసేసీఁ దాను
యీచేఁతలకేకదే ఇంత వలచితిని
(॥వీఁడి॥)
చెప్పుకొంటేఁ దనపొందు సీమలో గంపలకొద్ది
యెప్పుడూ నీ చనవు నా కిచ్చెననవే
వొప్పుగా శ్రీవేంకటేశుఁ డొద్దిక నన్నేలెఁ దాను
తప్పకుండా నీసుద్దులే తలఁపౌను నాకును
(||pallavi||)
vīm̐ḍivo nā ramaṇum̐ḍu viṁṭām̐ dānunnavām̐ḍu
pom̐ḍimidom̐ jĕli nīvu pŏṁchi yĕchchariṁchave
(||vīm̐ḍi||)
yĕṁchugŏṁṭe tana batti yĕṁtainā nāgum̐ galadu
vaṁchĕnado mŏkke maṟavagu manave
yiṁchugaṁta daḍavainā yĕḍayam̐ḍu nannum̐ bāsi
maṁchidāya yīmelu manasulom̐ bāyade
(||vīm̐ḍi||)
sūsugŏṁṭe tā nichchina sŏmmulu nā mena nivĕ
vesaṁdālām̐ bŏgaḍenu vinamanave
kāsugŏni nādone kām̐puramusesīm̐ dānu
yīsem̐talagegade iṁta valasidini
(||vīm̐ḍi||)
sĕppugŏṁṭem̐ danabŏṁdu sīmalo gaṁpalagŏddi
yĕppuḍū nī sanavu nā kichchĕnanave
vŏppugā śhrīveṁkaḍeśhum̐ ḍŏddiga nannelĕm̐ dānu
tappaguṁḍā nīsuddule talam̐paunu nāgunu