Veemdivo ala vijayaraaghavumdu

వీఁడివో అల విజయరాఘవుఁడు
Language

(॥పల్లవి॥)
వీఁడివో అల విజయరాఘవుఁడు
పోఁడిమిఁ గొలువునఁ బొదలీఁ జెలియా

(॥వీఁడి॥)
రాముఁడు లోకాభిరాముఁడు గుణ-
ధాముఁ డసురలకు దమనుఁడు
తామరకన్నులదశరథ తనయఁడు
మోమున నవ్వీ మొక్కవె చెలియా

(॥వీఁడి॥)
కోదండధరుఁడు గురుకిరీటపతి
పోదిగ సురముని పూజితుఁడు
ఆదిమ పురుషుడు అంబుదవర్ణుఁడు
నీదెస చూపులు నించీఁ జెలియా

(॥వీఁడి॥)
రావణాంతకుఁడు రాజశేఖరుఁడు
శ్రీ వేంకటగిరి సీతాపతి
వావిలిపాటిలో వరమూర్తి దానై
వోవరిఁ గొలువుల నున్నాఁడే చెలియా

(||pallavi||)
vīm̐ḍivo ala vijayarāghavum̐ḍu
pom̐ḍimim̐ gŏluvunam̐ bŏdalīm̐ jĕliyā

(||vīm̐ḍi||)
rāmum̐ḍu logābhirāmum̐ḍu guṇa-
dhāmum̐ ḍasuralagu damanum̐ḍu
tāmaragannuladaśharatha tanayam̐ḍu
momuna navvī mŏkkavĕ sĕliyā

(||vīm̐ḍi||)
kodaṁḍadharum̐ḍu gurugirīḍabadi
podiga suramuni pūjidum̐ḍu
ādima puruṣhuḍu aṁbudavarṇum̐ḍu
nīdĕsa sūbulu niṁchīm̐ jĕliyā

(||vīm̐ḍi||)
rāvaṇāṁtagum̐ḍu rājaśhekharum̐ḍu
śhrī veṁkaḍagiri sīdābadi
vāvilibāḍilo varamūrdi dānai
vovarim̐ gŏluvula nunnām̐ḍe sĕliyā