Veemde soodare yemta vedugagaamdu

వీఁడె చూడరే యెంత వేడుకకాఁడు
Language

(॥పల్లవి॥)
వీఁడె చూడరే యెంత వేడుకకాఁడు
తీఁడుకొనీ మీసాలు తిరువేంగళేశుఁడు

(॥॥)
భూపతిచెరువుకాడ పువ్వులమాకులనీడ
రాపైనమిక్కిలిసింగారాలతోడ
చూపట్టుఁ గాంతలనెల్లాఁ జొక్కించి తరి-
తీపులఁ బెట్టీ నిదే తిరువేంగళేశుఁడు

(॥॥)
కట్టుఁ గాలువదండ కడుమచ్చికలు నిండ
మట్టుక వున్నదే తిరుమలకొండ
జట్టిగొని సతులతో సరసములాడుకొంటా
దిట్టయై నవ్వులు నవ్వీఁ దిరువెంగళేశుఁడు

(॥॥)
ముప్పిరిగొన్నవీదుల ముంచి మోహముపోదుల
విప్పుచుఁ బైఁజల్లేటివిరివాదుల
యెప్పుడు శ్రీవేంకటేశుఁ డితఁడె ఇంతులఁ గంటేఁ
దెప్పరము పెండ్లాడీఁ దిరువేంగళేశుఁడు

(||pallavi||)
vīm̐ḍĕ sūḍare yĕṁta veḍugagām̐ḍu
tīm̐ḍugŏnī mīsālu tiruveṁgaḽeśhum̐ḍu

(||||)
bhūbadisĕruvugāḍa puvvulamāgulanīḍa
rābainamikkilisiṁgārāladoḍa
sūbaṭṭum̐ gāṁtalanĕllām̐ jŏkkiṁchi tari-
tībulam̐ bĕṭṭī nide tiruveṁgaḽeśhum̐ḍu

(||||)
kaṭṭum̐ gāluvadaṁḍa kaḍumachchigalu niṁḍa
maṭṭuga vunnade tirumalagŏṁḍa
jaṭṭigŏni sadulado sarasamulāḍugŏṁṭā
diṭṭayai navvulu navvīm̐ diruvĕṁgaḽeśhum̐ḍu

(||||)
muppirigŏnnavīdula muṁchi mohamubodula
vippusum̐ baim̐jalleḍivirivādula
yĕppuḍu śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍĕ iṁtulam̐ gaṁṭem̐
dĕpparamu pĕṁḍlāḍīm̐ diruveṁgaḽeśhum̐ḍu