వీదులనెల్లాఁ దానే గోవిందరాజు
(॥పల్లవి॥)
వీదులనెల్లాఁ దానే గోవిందరాజు
ఆదిగొని సేస చల్లీనదె గోవిందరాజు
(॥॥)
చెక్కుటద్దము లిద్దరు చెలులకుఁ జూపుతాను
వెక్కసమై మెరసీ గోవిందరాజు
చిక్కనివెన్నెలతేట సెలవులఁ జిందుతాను
అక్కరతో మాఁటలాడీ నదె గోవిందరాజు
(॥॥)
కదిసి చనుమొనలఁ గాయ మొరుసుకుంటాను
వెదచల్లీ వలపు గోవిందరాజు
వదనాంబుజము మోవివాసనలు చూపుతాను
అదిమీఁ దొడలు చేత నదె గోంవిదరాజు
(॥॥)
పరిమళములు చూచి పడఁతుల తురుములు
విరుల వేసీని గోవిందరాజు
సురతమర్మములెల్లాఁ జూపి కాఁగిళ్లనుఁ గూడీ-
నరుదై శ్రీ వేంకటాద్రి నదె గోవిందరాజు
(||pallavi||)
vīdulanĕllām̐ dāne goviṁdarāju
ādigŏni sesa sallīnadĕ goviṁdarāju
(||||)
sĕkkuḍaddamu liddaru sĕlulagum̐ jūbudānu
vĕkkasamai mĕrasī goviṁdarāju
sikkanivĕnnĕladeḍa sĕlavulam̐ jiṁdudānu
akkarado mām̐ṭalāḍī nadĕ goviṁdarāju
(||||)
kadisi sanumŏnalam̐ gāya mŏrusuguṁṭānu
vĕdasallī valabu goviṁdarāju
vadanāṁbujamu movivāsanalu sūbudānu
adimīm̐ dŏḍalu seda nadĕ goṁvidarāju
(||||)
parimaḽamulu sūsi paḍam̐tula turumulu
virula vesīni goviṁdarāju
suradamarmamulĕllām̐ jūbi kām̐giḽlanum̐ gūḍī-
narudai śhrī veṁkaḍādri nadĕ goviṁdarāju