Vedugayyeem balugave vegame

వేడుకయ్యీఁ బలుకవే వేగమే
Language

(॥పల్లవి॥)
వేడుకయ్యీఁ బలుకవే వేగమే
యీడకు వచ్చినాఁడా ఇంతలోననే

(॥వేడు॥)
చెలి పోయివచ్చితివా చెలువుఁడున్నాడకు
పోలుపుగా నాతనిఁ బొడగంటివా
పిలిచితివా రమ్మని ప్రియము సేసితివా
తెలిపి చెప్పితివా తెగరానిమోహము

(॥వేడు॥)
ముందె కానుకిచ్చితివా మొక్కితివా నామారు
కందు వెరిఁగించితివా గక్కన నీవు
మందలించి ఆడఁగలమాటలెల్లా నాడితివా
పొందులెల్లాఁ దలఁపించి పోనీక తెచ్చితివా

(॥వేడు॥)
పాదాలు గడిగితివా పానుపు వేసితివా
యీదెస నన్ను లాలించీ ఇదివోట్టె తాను
పాదుగ నలమేల్‌మంగపతి శ్రీవేంకటేశుఁడు
ఆదిగొని నన్ను నేలె ఆస వుట్టించితివా

(||pallavi||)
veḍugayyīm̐ balugave vegame
yīḍagu vachchinām̐ḍā iṁtalonane

(||veḍu||)
sĕli poyivachchidivā sĕluvum̐ḍunnāḍagu
polubugā nādanim̐ bŏḍagaṁṭivā
pilisidivā rammani priyamu sesidivā
tĕlibi sĕppidivā tĕgarānimohamu

(||veḍu||)
muṁdĕ kānugichchidivā mŏkkidivā nāmāru
kaṁdu vĕrim̐giṁchidivā gakkana nīvu
maṁdaliṁchi āḍam̐galamāḍalĕllā nāḍidivā
pŏṁdulĕllām̐ dalam̐piṁchi ponīga tĕchchidivā

(||veḍu||)
pādālu gaḍigidivā pānubu vesidivā
yīdĕsa nannu lāliṁchī idivoṭṭĕ tānu
pāduga nalamel‌maṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
ādigŏni nannu nelĕ āsa vuṭṭiṁchidivā