(॥పల్లవి॥)
వేడుక మదనుని విద్యలివి
వాడలఁ గతలివి వాఁటములాయె
(॥వేడు॥)
చలములు సతితో సాదించరాఁగా
వలపులు రేఁగెను వడిఁబడెను
చెలువుఁడ మఱియును చెక్కులు నొక్కఁగ
అలరినయాసలు అవుఁదున జిక్కె
(॥వేడు॥)
కాయపుమదములు కాఁకలఁ బెనఁగంగ
పాయపుటురు లివి పైఁ దవిలె
వోయయ్య తమకపుటోడ లాడఁగా
ఆయపుకుచములు అడిబర వాయె
(॥వేడు॥)
కక్కసించి యిటు కాంగిఁటఁ బెనఁగఁగ
లక్కవంటిమతి లలిఁ గరఁగె
యిక్కువ శ్రీవేంకటేశ కూడితివి
వెక్కస మీపెకు వెల్లవిరాయె
(||pallavi||)
veḍuga madanuni vidyalivi
vāḍalam̐ gadalivi vām̐ṭamulāyĕ
(||veḍu||)
salamulu sadido sādiṁcharām̐gā
valabulu rem̐gĕnu vaḍim̐baḍĕnu
sĕluvum̐ḍa maṟiyunu sĕkkulu nŏkkam̐ga
alarinayāsalu avum̐duna jikkĕ
(||veḍu||)
kāyabumadamulu kām̐kalam̐ bĕnam̐gaṁga
pāyabuḍuru livi paim̐ davilĕ
voyayya tamagabuḍoḍa lāḍam̐gā
āyabugusamulu aḍibara vāyĕ
(||veḍu||)
kakkasiṁchi yiḍu kāṁgim̐ṭam̐ bĕnam̐gam̐ga
lakkavaṁṭimadi lalim̐ garam̐gĕ
yikkuva śhrīveṁkaḍeśha kūḍidivi
vĕkkasa mībĕgu vĕllavirāyĕ