వెడలెను కోదండపాణి (మొదటి భాగం)
పల్లవి:
వెడలెను కోదండపాణి అడవులబడి మునివెంబడి
వెడలెను కోదండపాణి
నడచినంత మేరా వనము నందన వనమాయెను
స్వామి అడుగులిడిన పుడమి మురిసి హర్షము వర్షించెను
పతిత పావనుని పదము భవ బంధవినాశము
పాతకాల బండరాయి పడతి రూపునొందెనూ
వెడలెను కోదండపాణి
చరణం 1:
పురవీధిని నడిచేది నరుడు కాడు హరియే
హరుని విల్లు యెత్తేదీ తరుణిని చేపట్టేది
ఈ వరుడే సుందరుడేయని పౌరులు డెందెమ్ముల
పరిపరి విధముల ప్రస్తుతించి తిలకించగ పులకించగగ
వెడలెను కోదండపాణీ
నిండుజాబిలి కదా నెలత జానకి వదనము
పండు వెన్నెల వాడా పడతి శ్రీ సదనము
దారంట పోయేటి దశరధ రామయ్యా
క్రీగంట చూడ వలపుల జేగంట మ్రోగే
వెడలెను కోదండ పాణి వడివడిగా ముని వెంబడి
వెడలెను కోదండపాణీ
pallavi:
vĕḍalĕnu kodaṁḍabāṇi aḍavulabaḍi munivĕṁbaḍi
vĕḍalĕnu kodaṁḍabāṇi
naḍasinaṁta merā vanamu naṁdana vanamāyĕnu
svāmi aḍuguliḍina puḍami murisi harṣhamu varṣhiṁchĕnu
padida pāvanuni padamu bhava baṁdhavināśhamu
pādagāla baṁḍarāyi paḍadi rūbunŏṁdĕnū
vĕḍalĕnu kodaṁḍabāṇi
saraṇaṁ 1:
puravīdhini naḍisedi naruḍu kāḍu hariye
haruni villu yĕttedī taruṇini sebaṭṭedi
ī varuḍe suṁdaruḍeyani paurulu ḍĕṁdĕmmula
paribari vidhamula prastudiṁchi tilagiṁchaga pulagiṁchagaga
vĕḍalĕnu kodaṁḍabāṇī
niṁḍujābili kadā nĕlada jānagi vadanamu
paṁḍu vĕnnĕla vāḍā paḍadi śhrī sadanamu
dāraṁṭa poyeḍi daśharadha rāmayyā
krīgaṁṭa sūḍa valabula jegaṁṭa mroge
vĕḍalĕnu kodaṁḍa pāṇi vaḍivaḍigā muni vĕṁbaḍi
vĕḍalĕnu kodaṁḍabāṇī