వెదకరే చెలులాల వీదివీదులను వీని
(॥పల్లవి॥)
వెదకరే చెలులాల వీదివీదులను వీని
కదిసి ముద్దాడినదాఁకాఁ గలఁగీఁ జిత్తము
(॥వెద॥)
యేకడ మాటలాడీనో యింతక నే డింట నుఁటే
అక్కరతోఁ బదిమారు లారగించును
చొక్కపుఁగృష్ణుఁడు యెందుఁ జూచీనో వినోదాలు
చిక్క పుఁగచ్చకాయలు చేతనే మీటుచును
(॥వెద॥)
యెవ్వరెత్తుకున్నవారో, ఇంతక ముంగిట నుంటే
చివ్వన నగుచు నాచేయి వట్టును
నివ్వటిల్లుఁ గృష్ణుఁ డెందు నేఁడు పరకైనాఁడో
ఇవ్వల నుంటేఁ గన్నవెల్లా నడుగును
(॥వెద॥)
యెంత సంతసమైనదో ఇండ్లిండ్లవెన్నలు దిని
రంతుతోఁ బడుచులతో రాయడించఁడు
ఇతలో శ్రీవేంకటేశుఁ డెదురుగావచ్చి తన్ను
మంతనానఁ గాఁగిలించి మాయ చూపెను
(||pallavi||)
vĕdagare sĕlulāla vīdivīdulanu vīni
kadisi muddāḍinadām̐kām̐ galam̐gīm̐ jittamu
(||vĕda||)
yegaḍa māḍalāḍīno yiṁtaga ne ḍiṁṭa num̐ṭe
akkaradom̐ badimāru lāragiṁchunu
sŏkkabum̐gṛṣhṇum̐ḍu yĕṁdum̐ jūsīno vinodālu
sikka pum̐gachchagāyalu sedane mīḍusunu
(||vĕda||)
yĕvvarĕttugunnavāro, iṁtaga muṁgiḍa nuṁṭe
sivvana nagusu nāseyi vaṭṭunu
nivvaḍillum̐ gṛṣhṇum̐ ḍĕṁdu nem̐ḍu paragainām̐ḍo
ivvala nuṁṭem̐ gannavĕllā naḍugunu
(||vĕda||)
yĕṁta saṁtasamainado iṁḍliṁḍlavĕnnalu dini
raṁtudom̐ baḍusulado rāyaḍiṁcham̐ḍu
idalo śhrīveṁkaḍeśhum̐ ḍĕdurugāvachchi tannu
maṁtanānam̐ gām̐giliṁchi māya sūbĕnu