వట్టి యనుమానమేల వద్దనున్నాఁ డితఁడు
(॥పల్లవి॥)
వట్టి యనుమానమేల వద్దనున్నాఁ డితఁడు
చుట్టమైనవాని నెంత సోదించేవే
(॥వట్టి॥)
చెలిమిసేసినవాఁడు చేతిలోనివాఁడు కాఁడా
తలఁపులోపలివాఁడు తగులేకాదా
పిలిచినవాఁడు కడుఁబ్రియములు చూపఁడా
సొలసి యాతనినేల చూచి జరసేవే
(॥వట్టి॥)
యింటికివచ్చినవాఁడు యియ్యకొనిమాటాడఁడా
అంటిముట్టిపెనఁగేవాఁ డాదరించఁడా
చంటిపై గోరొత్తేవాఁడు చనవు లొసఁగఁడా
జంటైనపతితోనేల సాములు సేసేవే
(॥వట్టి॥)
కూరిమిచూపినవాఁడు కూడినవాఁడే కాఁడా
సారెకు నవ్వినాఁ డిఁక సమ్మతే కాదా
యీరతి శ్రీవేంకటేశుఁ డిన్నిటా నిన్ను నేలె
గారవించి యిఁకనేల కతలు సేసేవే
(||pallavi||)
vaṭṭi yanumānamela vaddanunnām̐ ḍidam̐ḍu
suṭṭamainavāni nĕṁta sodiṁcheve
(||vaṭṭi||)
sĕlimisesinavām̐ḍu sedilonivām̐ḍu kām̐ḍā
talam̐pulobalivām̐ḍu tagulegādā
pilisinavām̐ḍu kaḍum̐briyamulu sūbam̐ḍā
sŏlasi yādaninela sūsi jaraseve
(||vaṭṭi||)
yiṁṭigivachchinavām̐ḍu yiyyagŏnimāḍāḍam̐ḍā
aṁṭimuṭṭibĕnam̐gevām̐ ḍādariṁcham̐ḍā
saṁṭibai gorŏttevām̐ḍu sanavu lŏsam̐gam̐ḍā
jaṁṭainabadidonela sāmulu seseve
(||vaṭṭi||)
kūrimisūbinavām̐ḍu kūḍinavām̐ḍe kām̐ḍā
sārĕgu navvinām̐ ḍim̐ka sammade kādā
yīradi śhrīveṁkaḍeśhum̐ ḍinniḍā ninnu nelĕ
gāraviṁchi yim̐kanela kadalu seseve