Vatti visaaramulela vaadu laduvamga nela

వట్టి విచారములేల వాదు లడువఁగ నేల
Language

(॥పల్లవి॥)
వట్టి విచారములేల వాదు లడువఁగ నేల
రట్టడి పతిని చెలు లిట్టె రమ్మనరే

(॥వట్టి॥)
ననచినఁగాని మరి నవ్వు రాదు
పెనఁగులాడినఁగాని ప్రియములేదు
తనిసినఁగాని సంతసముగాదు
చెనకి నప్పుడు గాని సిగ్గు విడదు

(॥వట్టి॥)
బలిమి చేసినఁగాని పంతము రాదు
కలసినఁగాని లోలో కాఁక దేరదు
తలఁచినఁగాని యట్టె తమి రేఁగదు
వలచినఁగాని గర్వము నిండుకొనదు

(॥వట్టి॥)
సరసమాడినఁగాని చవి వుట్టదు
యెరవులేకున్నఁగాని యింపుగాదు
ఇరవై శ్రీవేంకటేశుఁ డెనసె నన్నుఁదానె
సరవితో నున్నఁగాని ముచ్చటలెల్లాఁ బాయవు

(||pallavi||)
vaṭṭi visāramulela vādu laḍuvam̐ga nela
raṭṭaḍi padini sĕlu liṭṭĕ rammanare

(||vaṭṭi||)
nanasinam̐gāni mari navvu rādu
pĕnam̐gulāḍinam̐gāni priyamuledu
tanisinam̐gāni saṁtasamugādu
sĕnagi nappuḍu gāni siggu viḍadu

(||vaṭṭi||)
balimi sesinam̐gāni paṁtamu rādu
kalasinam̐gāni lolo kām̐ka deradu
talam̐sinam̐gāni yaṭṭĕ tami rem̐gadu
valasinam̐gāni garvamu niṁḍugŏnadu

(||vaṭṭi||)
sarasamāḍinam̐gāni savi vuṭṭadu
yĕravulegunnam̐gāni yiṁpugādu
iravai śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ nannum̐dānĕ
saravido nunnam̐gāni muchchaḍalĕllām̐ bāyavu