Vatti suttarigamulu vadigaam jese vademe

వట్టి చుట్టరికములు వడిగాఁ జేసే వదేమే
Language

(॥పల్లవి॥)
వట్టి చుట్టరికములు వడిగాఁ జేసే వదేమే
యిట్టె మేలువాఁడు యిన్నిటా నా కితఁడు

(॥వట్టి॥)
యిత్తల నాతఁడు నేనూ నేకతములాడఁగాను
పొత్తుల మాఁటాడేవు పొద్దు వోదటే
మత్తిలి సరసములు మాలో నేమాడఁగాను
హత్తి తోరలించుకొనే వప్పటినేమే

(॥వట్టి॥)
జంటలై నే మిద్దరమూ జవాది వూసుకోఁగా
అంటించుకో వచ్చేవు అదో నీవు
నంటుతోడ మాలో నేము నవ్వులు నవ్వుకోఁగా
వెంట నీవూఁ దోడంటేవు వేడుకాయ నటవే

(॥వట్టి॥)
శ్రీవేంకటేశుఁడు నేనూఁ జేరి కాఁగిట నుండఁగా
వావి గలపఁ జూచేవు వైపౌనటవే
యీవేళ నలమేల్మంగ నీతని దేవులనైతి
నీవూఁ దగులు సేసుకొనేవు మేలు మేలే

(||pallavi||)
vaṭṭi suṭṭarigamulu vaḍigām̐ jese vademe
yiṭṭĕ meluvām̐ḍu yinniḍā nā kidam̐ḍu

(||vaṭṭi||)
yittala nādam̐ḍu nenū negadamulāḍam̐gānu
pŏttula mām̐ṭāḍevu pŏddu vodaḍe
mattili sarasamulu mālo nemāḍam̐gānu
hatti toraliṁchugŏne vappaḍineme

(||vaṭṭi||)
jaṁṭalai ne middaramū javādi vūsugom̐gā
aṁṭiṁchugo vachchevu ado nīvu
naṁṭudoḍa mālo nemu navvulu navvugom̐gā
vĕṁṭa nīvūm̐ doḍaṁṭevu veḍugāya naḍave

(||vaṭṭi||)
śhrīveṁkaḍeśhum̐ḍu nenūm̐ jeri kām̐giḍa nuṁḍam̐gā
vāvi galabam̐ jūsevu vaibaunaḍave
yīveḽa nalamelmaṁga nīdani devulanaidi
nīvūm̐ dagulu sesugŏnevu melu mele