Vatti siggu limkanela varavaadaanu

వట్టి సిగ్గు లిఁకనేల వరవాతాను
Language

(॥పల్లవి॥)
వట్టి సిగ్గు లిఁకనేల వరవాతాను
చుట్టపు వరుస నీకుఁ జూపుతానే వున్నది

(॥వట్టి॥)
యెక్క డపరాకు నీకు నింతిఁ జిత్తగించరాదా
చొక్కపుఁ జూపుల నిన్నుఁ జూచీనదె
మక్కువతోడుత నిట్టె మాటపలుకాడరాదా
ఇక్కువ లరసుకొంటా ఇంటికి వచ్చినది

(॥వట్టి॥)
కోరివేఁడి నీదండనుఁ గూచుండఁ వెట్టుకోరాదా
నేరుపునఁ గొలువులో నిలుచున్నది
చేరవచ్చి ఆదరించి చేత నందుకోరాదా
మేరతో విడెమియ్యఁగ మీఁదెత్తుక వున్నది

(॥పట్టి॥)
చనవిచ్చి కొంతగొంత సరసమాడఁగరాదా
గొనకొని నీతో నవ్వుకొంటానున్నది
యెనసితివి శ్రీవేంకటేశ ఇంతలో నన్ను
పెనఁగరాదా యాపెతో ప్రియమున నున్నది

(||pallavi||)
vaṭṭi siggu lim̐kanela varavādānu
suṭṭabu varusa nīgum̐ jūbudāne vunnadi

(||vaṭṭi||)
yĕkka ḍabarāgu nīgu niṁtim̐ jittagiṁcharādā
sŏkkabum̐ jūbula ninnum̐ jūsīnadĕ
makkuvadoḍuda niṭṭĕ māḍabalugāḍarādā
ikkuva larasugŏṁṭā iṁṭigi vachchinadi

(||vaṭṭi||)
korivem̐ḍi nīdaṁḍanum̐ gūsuṁḍam̐ vĕṭṭugorādā
nerubunam̐ gŏluvulo nilusunnadi
seravachchi ādariṁchi seda naṁdugorādā
merado viḍĕmiyyam̐ga mīm̐dĕttuga vunnadi

(||paṭṭi||)
sanavichchi kŏṁtagŏṁta sarasamāḍam̐garādā
gŏnagŏni nīdo navvugŏṁṭānunnadi
yĕnasidivi śhrīveṁkaḍeśha iṁtalo nannu
pĕnam̐garādā yābĕdo priyamuna nunnadi