Vatti sadalu sesevu vaddigi rammanusunu

వట్టి సటలు సేసేవు వద్దికి రమ్మనుచును
Language

(॥పల్లవి॥)
వట్టి సటలు సేసేవు వద్దికి రమ్మనుచును
పట్టి నేఁ బెనఁగితేను పరాకు మానేవా

(॥వట్టి॥)
మన్ననగలసతితో మాటలు నీవాడఁగాను
విన్నపము నేఁ జేసితే వినేవా నీవు
సన్నలాచాయలా నాపె సరి నెలయించఁగాను
యెన్ని కానుక లిచ్చినా యిక్కడ చూచేవా

(॥వట్టి॥)
పిలిచితెచ్చినాపెతో బెరసి నీవు నవ్వఁగా
కలయ నే వచ్చితే కాఁగలించేవా
నిలుచుండి కొలువున నిన్నాపె యెలయంచఁగా
వలపు నేఁ జల్లితేను వసమయ్యేవా

(॥వట్టి॥)
జంగఁ గూచుండినఇంతిచన్నులు నీవు ముట్టఁగా
ఇంటికి రమ్మంటే నీ కితవయ్యీనా
అంటి నన్నుఁ గూడితివి అంతలో శ్రీవేంకటేశ
వొంటినెంతజంకించినా వొడఁబడడేవా

(||pallavi||)
vaṭṭi saḍalu sesevu vaddigi rammanusunu
paṭṭi nem̐ bĕnam̐gidenu parāgu mānevā

(||vaṭṭi||)
mannanagalasadido māḍalu nīvāḍam̐gānu
vinnabamu nem̐ jeside vinevā nīvu
sannalāsāyalā nābĕ sari nĕlayiṁcham̐gānu
yĕnni kānuga lichchinā yikkaḍa sūsevā

(||vaṭṭi||)
pilisidĕchchinābĕdo bĕrasi nīvu navvam̐gā
kalaya ne vachchide kām̐galiṁchevā
nilusuṁḍi kŏluvuna ninnābĕ yĕlayaṁcham̐gā
valabu nem̐ jallidenu vasamayyevā

(||vaṭṭi||)
jaṁgam̐ gūsuṁḍina̮iṁtisannulu nīvu muṭṭam̐gā
iṁṭigi rammaṁṭe nī kidavayyīnā
aṁṭi nannum̐ gūḍidivi aṁtalo śhrīveṁkaḍeśha
vŏṁṭinĕṁtajaṁkiṁchinā vŏḍam̐baḍaḍevā