వట్టి నిష్టూరమేఁటికే వనితలకు
(॥పల్లవి॥)
వట్టి నిష్టూరమేఁటికే వనితలకు
చుట్టరికము సేయఁగా సూడు వట్టఁదగునా
(॥వట్టి॥)
యెగసక్కే లేలాడేవే యెదుట నీ విభుఁడు నా
మొగము చూచితే నేను మొక్కఁగరాదా
నగనేలే నీ వప్పటి నా యింటి కితఁడు రాఁగా
సొగిసి నే నించుకంత చోటియ్య వలదా
(॥వట్టి॥)
వేసరుకోనేఁటికే వేడుకతో నాతఁడు
నాసంగడి నుండఁగఁ జెనకఁగరాదా
వాసులేల నెరపేవే వాలాయించి నా కాతఁడు
చేసన్నలు గావించఁగా సేవ సేయ వలదా
(॥వట్టి॥)
చేతులేల చాఁచేవే శ్రీ వేంకటేశుఁడు నాకు
ఆతఁడే విడెమియ్యఁగా నందుకోరాదా
కాతరించ నిఁకనేలే గట్టిగా నన్నేలినాఁడు
నీతో గూడె నన్నూ మన్నించె మెచ్చవలదా
(||pallavi||)
vaṭṭi niṣhṭūramem̐ṭige vanidalagu
suṭṭarigamu seyam̐gā sūḍu vaṭṭam̐dagunā
(||vaṭṭi||)
yĕgasakke lelāḍeve yĕduḍa nī vibhum̐ḍu nā
mŏgamu sūside nenu mŏkkam̐garādā
naganele nī vappaḍi nā yiṁṭi kidam̐ḍu rām̐gā
sŏgisi ne niṁchugaṁta soḍiyya valadā
(||vaṭṭi||)
vesarugonem̐ṭige veḍugado nādam̐ḍu
nāsaṁgaḍi nuṁḍam̐gam̐ jĕnagam̐garādā
vāsulela nĕrabeve vālāyiṁchi nā kādam̐ḍu
sesannalu gāviṁcham̐gā seva seya valadā
(||vaṭṭi||)
sedulela sām̐seve śhrī veṁkaḍeśhum̐ḍu nāgu
ādam̐ḍe viḍĕmiyyam̐gā naṁdugorādā
kādariṁcha nim̐kanele gaṭṭigā nannelinām̐ḍu
nīdo gūḍĕ nannū manniṁchĕ mĕchchavaladā