వట్టి నిష్టూరమే ఇంతే వద్దే యింత
(॥పల్లవి॥)
వట్టి నిష్టూరమే ఇంతే వద్దే యింత
నిట్టచూపు చూచితేనే నీకుఁ బాలు వచ్చీనా
(॥వట్టి॥)
పగటులు సారెసారెఁ బచరించి మాకు నీవు
తగవు లేమిచెప్పేవే తరుని నేఁడ
వొగి మంచితనాననే వొలపక్షా లాడేవు
నిగిడి యీకూటమిలో నీకుఁ బాలు పచ్చీనా
(॥వట్టి॥)
నెఱతనములు చూపి నీవు మీఇద్దరిలోనా
వొణగులు దిద్దేవు వువిద నీవు
కఱకఱి నిచ్చలాడి కలయవేసేవు నిన్ను
నెఱమానవులలోన నీకుఁ బాలు వచ్చినా
(॥వట్టి॥)
అలమేలుమగను నే నాతఁడు శ్రీవేంకటేశుఁ
డలుకలఁ దిద్దితివి అవునే నీవు
కలగొన మొక్కింపించి కాఁగిలించితి విట్టె
నెలకొన్న యీవేడుక నీకుఁ బాలు వచ్చీనా
(||pallavi||)
vaṭṭi niṣhṭūrame iṁte vadde yiṁta
niṭṭasūbu sūsidene nīgum̐ bālu vachchīnā
(||vaṭṭi||)
pagaḍulu sārĕsārĕm̐ basariṁchi māgu nīvu
tagavu lemisĕppeve taruni nem̐ḍa
vŏgi maṁchidanānane vŏlabakṣhā lāḍevu
nigiḍi yīgūḍamilo nīgum̐ bālu pachchīnā
(||vaṭṭi||)
nĕṟadanamulu sūbi nīvu mīiddarilonā
vŏṇagulu diddevu vuvida nīvu
kaṟagaṟi nichchalāḍi kalayavesevu ninnu
nĕṟamānavulalona nīgum̐ bālu vachchinā
(||vaṭṭi||)
alamelumaganu ne nādam̐ḍu śhrīveṁkaḍeśhum̐
ḍalugalam̐ diddidivi avune nīvu
kalagŏna mŏkkiṁpiṁchi kām̐giliṁchidi viṭṭĕ
nĕlagŏnna yīveḍuga nīgum̐ bālu vachchīnā