వట్టి నేరాలెంచ కిఁక వచ్చేవో రావో
(॥పల్లవి॥)
వట్టి నేరాలెంచ కిఁక వచ్చేవో రావో
చుట్టరికాలలో యింత సూడుఁబాడుఁ గలదా
(॥వట్టి॥)
బొమ్మల జంకించితేనే వూఁచి మాటాడుత గాదా
కొమ్మకు నీమీఁద నింత కోపమున్నదా
వుమ్మడిగా నవ్వితేనే వుంకువ వెట్టుత గాదా
ఇమ్ముల నీతో నాకె యెగసక్కెమాడెనా
(॥వట్టి॥)
తప్పక చూచినదే తగులఁదీసుటగాదా
అప్పుడే యాకె నిన్ను నదలించెనా
అప్పటి నెదుటనుంటే యాసపడుటగాదా
వుప్పతించి ఆకె నిన్ను నొరయఁగవచ్చెనా
(॥వట్టి॥)
సంగడిఁ గూచుండితేనే సమరతి యౌతగాదా
చుంగుల నీతో బలిమి చూపవచ్చెనా
రంగగు శ్రీ వేంకటేశ రమణిఁ గూడితి విట్టె
చెంగట నప్పుడే నేను చెప్పినదేకాదా
(||pallavi||)
vaṭṭi nerālĕṁcha kim̐ka vachchevo rāvo
suṭṭarigālalo yiṁta sūḍum̐bāḍum̐ galadā
(||vaṭṭi||)
bŏmmala jaṁkiṁchidene vūm̐si māḍāḍuda gādā
kŏmmagu nīmīm̐da niṁta kobamunnadā
vummaḍigā navvidene vuṁkuva vĕṭṭuda gādā
immula nīdo nāgĕ yĕgasakkĕmāḍĕnā
(||vaṭṭi||)
tappaga sūsinade tagulam̐dīsuḍagādā
appuḍe yāgĕ ninnu nadaliṁchĕnā
appaḍi nĕduḍanuṁṭe yāsabaḍuḍagādā
vuppadiṁchi āgĕ ninnu nŏrayam̐gavachchĕnā
(||vaṭṭi||)
saṁgaḍim̐ gūsuṁḍidene samaradi yaudagādā
suṁgula nīdo balimi sūbavachchĕnā
raṁgagu śhrī veṁkaḍeśha ramaṇim̐ gūḍidi viṭṭĕ
sĕṁgaḍa nappuḍe nenu sĕppinadegādā