వట్టి కుచ్చితము వలదే నీకు
(॥పల్లవి॥)
వట్టి కుచ్చితము వలదే నీకు
యెట్టయినా నాతఁడు యేలునే నన్నును
(॥వట్టి॥)
మన్నించి పతి నాతో మాఁటలాడఁగాను
సన్నల నీవేల సాదించేవే
పన్నిననీమాయ పనికిరాదు ఆతఁ-
డెన్నిచెప్పినాను యేలునే నన్ను
(॥వట్టి॥)
సంతోసాన నాతో సరసమాడగాను
పొంత నీతనినేల బోదించేవే
పంతాలు నీకునిఁకఁ బనికిరావూ మరి
యెంతైనా నాతఁడు యేలునే నన్ను
(॥వట్టి॥)
అలమేలుమంగపతియగు శ్రీవేంకటేశుఁడు
యిల నన్నుఁ గూడఁగా నీవేల నవ్వేవే
బలిమి నీచేఁతలు పనికిరావూ యితఁ-
డెలమి నేకాలము యేలునే నన్ను
(||pallavi||)
vaṭṭi kuchchidamu valade nīgu
yĕṭṭayinā nādam̐ḍu yelune nannunu
(||vaṭṭi||)
manniṁchi padi nādo mām̐ṭalāḍam̐gānu
sannala nīvela sādiṁcheve
panninanīmāya panigirādu ādam̐-
ḍĕnnisĕppinānu yelune nannu
(||vaṭṭi||)
saṁtosāna nādo sarasamāḍagānu
pŏṁta nīdaninela bodiṁcheve
paṁtālu nīgunim̐kam̐ banigirāvū mari
yĕṁtainā nādam̐ḍu yelune nannu
(||vaṭṭi||)
alamelumaṁgabadiyagu śhrīveṁkaḍeśhum̐ḍu
yila nannum̐ gūḍam̐gā nīvela navveve
balimi nīsem̐talu panigirāvū yidam̐-
ḍĕlami negālamu yelune nannu