వట్టి జోలిఁ బొరలేవు వద్దన్నా మానవు
(॥పల్లవి॥)
వట్టి జోలిఁ బొరలేవు వద్దన్నా మానవు
వొట్టు కొకరి సొమ్ము వేరొకరికి దక్కునా
(॥వట్టి॥)
చక్కనిదాన వౌదువు జాణతనాలు నేర్తువు
ముక్కరఁ వెట్టుకుంటివి మోము చూచేవు
నెక్కొన్న నారమణుఁడు నీయెలయింపులకు
చిక్కఁడు గాని నీచేఁతలకు మెచ్చును
(॥వట్టి॥)
చుట్టమవు నౌదువు చొక్కులఁబెట్టాఁగలవు
యిట్టె సింగారించుకొంటి వీతనెదుట
గుట్టుతోడ నావిభుఁడు కోరి యిందుకు నిన్నుఁ జే-
పట్టఁడుగాని నీపగటులు మెచ్చును
(॥వట్టి॥)
మేలుదానవు నౌదువు మెప్పించా నీచేతనౌను
వేళ గాచుకుందానవు వెస మొక్కేవు
యేలె నన్ను శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగను
నీలోనుగాఁడుగాని నీబత్తికి మెచ్చును
(||pallavi||)
vaṭṭi jolim̐ bŏralevu vaddannā mānavu
vŏṭṭu kŏgari sŏmmu verŏgarigi dakkunā
(||vaṭṭi||)
sakkanidāna vauduvu jāṇadanālu nerduvu
mukkaram̐ vĕṭṭuguṁṭivi momu sūsevu
nĕkkŏnna nāramaṇum̐ḍu nīyĕlayiṁpulagu
sikkam̐ḍu gāni nīsem̐talagu mĕchchunu
(||vaṭṭi||)
suṭṭamavu nauduvu sŏkkulam̐bĕṭṭām̐galavu
yiṭṭĕ siṁgāriṁchugŏṁṭi vīdanĕduḍa
guṭṭudoḍa nāvibhum̐ḍu kori yiṁdugu ninnum̐ je-
paṭṭam̐ḍugāni nībagaḍulu mĕchchunu
(||vaṭṭi||)
meludānavu nauduvu mĕppiṁchā nīsedanaunu
veḽa gāsuguṁdānavu vĕsa mŏkkevu
yelĕ nannu śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu
nīlonugām̐ḍugāni nībattigi mĕchchunu