వట్టి జోలికిఁ బిలువవద్దు గాని
(॥పల్లవి॥)
వట్టి జోలికిఁ బిలువవద్దు గాని
పట్టిన వలపులెల్లాఁ బంచిపెట్టేవా
(॥వట్టి॥)
కందున నాతఁడు నిన్నుఁ గలువల వేసితేను
యిందుముఖుల మొగము లేమి చూచేవే
పొందులకుఁ దోడువచ్చి వూఁచి పెనఁగేరుగాని
దెము గెల్చినరతి పంచిపెట్టేవా
(॥వట్టి॥)
కూరిమి నాతఁడు నిన్నుఁ గొలువులోఁ దిట్టితేను
వారిజాక్షులకు నేల వడిఁ జెప్పేవు
సారె నతనిని మారు సాదించేరు గాని, వాని
పౌరకామినులలెల్లాఁ బంచిపెట్టేవా
(॥వట్టి॥)
సంగతి నాతఁడు నీచన్ను లంటి కూడితేను
సంగడిచెలులకేల సన్న సేసేవు
చెంగట శ్రీవేంకటేశుఁ జెనకేరుగాని మేలు
పంగించక చెలులకు పంచిపెట్టేవా
(||pallavi||)
vaṭṭi joligim̐ biluvavaddu gāni
paṭṭina valabulĕllām̐ baṁchibĕṭṭevā
(||vaṭṭi||)
kaṁduna nādam̐ḍu ninnum̐ galuvala vesidenu
yiṁdumukhula mŏgamu lemi sūseve
pŏṁdulagum̐ doḍuvachchi vūm̐si pĕnam̐gerugāni
dĕmu gĕlsinaradi paṁchibĕṭṭevā
(||vaṭṭi||)
kūrimi nādam̐ḍu ninnum̐ gŏluvulom̐ diṭṭidenu
vārijākṣhulagu nela vaḍim̐ jĕppevu
sārĕ nadanini māru sādiṁcheru gāni, vāni
pauragāminulalĕllām̐ baṁchibĕṭṭevā
(||vaṭṭi||)
saṁgadi nādam̐ḍu nīsannu laṁṭi kūḍidenu
saṁgaḍisĕlulagela sanna sesevu
sĕṁgaḍa śhrīveṁkaḍeśhum̐ jĕnagerugāni melu
paṁgiṁchaga sĕlulagu paṁchibĕṭṭevā