వట్టి జంపు లిఁక మాతో వద్దు వద్దయ్యా
(॥పల్లవి॥)
వట్టి జంపు లిఁక మాతో వద్దు వద్దయ్యా
చుట్టరికా లిద్దరివీఁ జూచుకోవయ్యా
(॥వట్టి॥)
పంతమాడవచ్చుఁగాని పాయరాదు సతులను
రంతులేల మా యింటికి రావయ్యా
చెంతనుండి కొంతవడికి సిగ్గువడవచ్చుఁగాని
మంతుకెక్కిన వలపు మఱవరాదయ్యా
(॥వట్టి॥)
తేలఁజూచి యాఁడువారిఁ దిట్టు దిట్టవచ్చుఁగాని
లోలో తమకము నిలుపరాదయ్యా
పాలుపడి రాజసము పచరించవచ్చుఁగాని
వోలి విరహపుకాఁక లోరువరాదయ్యా
(॥వట్టి॥)
బిగిసి చెలులతోడఁ బెనఁగవచ్చుఁగాని
తగులైన పొందికలు దాఁచరాదయ్యా
అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి
జిగిమించె నీ కతలు చెప్పరాదయ్యా
(||pallavi||)
vaṭṭi jaṁpu lim̐ka mādo vaddu vaddayyā
suṭṭarigā liddarivīm̐ jūsugovayyā
(||vaṭṭi||)
paṁtamāḍavachchum̐gāni pāyarādu sadulanu
raṁtulela mā yiṁṭigi rāvayyā
sĕṁtanuṁḍi kŏṁtavaḍigi sigguvaḍavachchum̐gāni
maṁtugĕkkina valabu maṟavarādayyā
(||vaṭṭi||)
telam̐jūsi yām̐ḍuvārim̐ diṭṭu diṭṭavachchum̐gāni
lolo tamagamu nilubarādayyā
pālubaḍi rājasamu pasariṁchavachchum̐gāni
voli virahabugām̐ka loruvarādayyā
(||vaṭṭi||)
bigisi sĕluladoḍam̐ bĕnam̐gavachchum̐gāni
tagulaina pŏṁdigalu dām̐sarādayyā
agabaḍi śhrīveṁkaḍādhiba nannelidivi
jigimiṁchĕ nī kadalu sĕpparādayyā