Vastaavu kalalogi

వస్తావు కలలోకి
Year
Language

పల్లవి:

వస్తావు కలలోకీ రానంటావు కౌగిలికీ ||2||
నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ
ఆ ముద్దు మురిపాలు తీరేది ఎన్నటికీ

వస్తాను కలలోకీ రానంటాను కౌగిలికీ ||2||
నువ్ కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలు సగపాలు ఇద్దరికీ

చరణం 1:

పెదవి పైన పెదవి గుబులు పడుచుదనమే తీయటి దిగులు
కుర్రవాడికి తీరదు మోజు చిన్నదానికి బిడియం పోదు

చూపు చూపు కలిసిన చాలు - కొంగు కొంగు కలిపిన మేలు
నన్ను దరి చేరనీ - ముద్దు వాటారని
ముద్దు నెరవేరనీ - ముందు జతకూడనీ

వస్తావు కలలోకీ రానంటాను కౌగిలికీ
నే కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలు సగపాలు ఇద్దరికీ

చరణం 2:

చిన్నదాన్ని నిన్నటి వరకు కన్నెనైనది ఎవ్వరి కొరకు
నాకు తెలుసు నాకోసమని నీకే తెలియదు ఇది విరహమని

నేనూ నువ్వు మనమైపొయే వేళా - ఇంకా ఇంకా ఇంతటి దూరం ఏలా
వలచి వలపించనా - కరిగి కరిగించనా
నవ్వి నవ్వించనా - గెలిచి గెలిపించనా

వస్తాను కలలోకీ రానంటాను కౌగిలికీ
నువ్ కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలు సగపాలు ఇద్దరికీ

వస్తావు కలలోకీ రానంటావు కౌగిలికీ
నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ
ఆ ముద్దు మురిపాలు తీరేది ఎన్నటికీ

pallavi:

vastāvu kalalogī rānaṁṭāvu kaugiligī ||2||
ne kanna kalalannī paṁḍedi ĕppaḍigī
ā muddu muribālu tīredi ĕnnaḍigī

vastānu kalalogī rānaṁṭānu kaugiligī ||2||
nuv kanna kalalannī sāliṁchu ippaḍigī
ā muddu muribālu sagabālu iddarigī

saraṇaṁ 1:

pĕdavi paina pĕdavi gubulu paḍusudaname tīyaḍi digulu
kurravāḍigi tīradu moju sinnadānigi biḍiyaṁ podu

sūbu sūbu kalisina sālu - kŏṁgu kŏṁgu kalibina melu
nannu dari seranī - muddu vāḍārani
muddu nĕraveranī - muṁdu jadagūḍanī

vastāvu kalalogī rānaṁṭānu kaugiligī
ne kanna kalalannī sāliṁchu ippaḍigī
ā muddu muribālu sagabālu iddarigī

saraṇaṁ 2:

sinnadānni ninnaḍi varagu kannĕnainadi ĕvvari kŏragu
nāgu tĕlusu nāgosamani nīge tĕliyadu idi virahamani

nenū nuvvu manamaibŏye veḽā - iṁkā iṁkā iṁtaḍi dūraṁ elā
valasi valabiṁchanā - karigi karigiṁchanā
navvi navviṁchanā - gĕlisi gĕlibiṁchanā

vastānu kalalogī rānaṁṭānu kaugiligī
nuv kanna kalalannī sāliṁchu ippaḍigī
ā muddu muribālu sagabālu iddarigī

vastāvu kalalogī rānaṁṭāvu kaugiligī
ne kanna kalalannī paṁḍedi ĕppaḍigī
ā muddu muribālu tīredi ĕnnaḍigī