వసివాడ నీకేల వనితలలో నెల్లా
(॥పల్లవి॥)
వసివాడ నీకేల వనితలలో నెల్లా
సుసరాన నీ చేతనె సూడువట్టించెను
(॥వసి॥)
దప్పిదేరే మోముతోడ దగదొట్టి వున్నాఁడవు
యిప్పు డిట్టియాపె నిన్ను యేమిచేసెనో
చెప్పరాదా నీకేఁటికి సిగ్గులు వడఁగ నేఁడు
చొప్పుగా నీచేతనె సూడువట్టించెను
(॥వసి॥)
పలు చెమటలతోడ భ్రమ సివున్నాఁడవ్వ(వు?)
అలివేణి నిన్నెంత అలఇంచెనో
తెలివి దెచ్చుకోరాదా దీమసము మాతోనేల
సులభాన నీచేతనే సూడువట్టించెను
(॥వసి॥)
గుట్టుతోడ లోలోనే గుబ్బతిల్లి వున్నాఁడవు
పట్టపుదేవి నిన్నెంత పనిగొనెనో
ఇట్టె శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నాకె
చుట్టి చుట్టి నీ చేతనే సూడు వట్టించెను
(||pallavi||)
vasivāḍa nīgela vanidalalo nĕllā
susarāna nī sedanĕ sūḍuvaṭṭiṁchĕnu
(||vasi||)
dappidere momudoḍa dagadŏṭṭi vunnām̐ḍavu
yippu ḍiṭṭiyābĕ ninnu yemisesĕno
sĕpparādā nīgem̐ṭigi siggulu vaḍam̐ga nem̐ḍu
sŏppugā nīsedanĕ sūḍuvaṭṭiṁchĕnu
(||vasi||)
palu sĕmaḍaladoḍa bhrama sivunnām̐ḍavva(vu?)
aliveṇi ninnĕṁta ala̮iṁchĕno
tĕlivi dĕchchugorādā dīmasamu mādonela
sulabhāna nīsedane sūḍuvaṭṭiṁchĕnu
(||vasi||)
guṭṭudoḍa lolone gubbadilli vunnām̐ḍavu
paṭṭabudevi ninnĕṁta panigŏnĕno
iṭṭĕ śhrī veṁkaḍeśha yelidivi nannu nāgĕ
suṭṭi suṭṭi nī sedane sūḍu vaṭṭiṁchĕnu