Vanidala jaadalu vaddamte maanaru

వనితల జాడలు వద్దంటే మానరు
Language

(॥పల్లవి॥)
వనితల జాడలు వద్దంటే మానరు
చనవు నీవిచ్చినదే సరివచ్చెనా

(॥వని॥)
ఆంకెలకువచ్చినదాఁకా నాడుదురు మాఁటలు
చంకకులోనైతేనే జంకింతురు
పొంకపుగొల్లెతలను భోగించి చూచితివి
సంకెదీర నామాట సరివచ్చెనా

(॥వని॥)
నమ్మికై నయందాఁకా నవ్వుదురు సెలవుల
సమ్మతించినందుమీఁద సాదింతురు
వుమ్మడిఁబదారువేల నొడివట్టి చూచితివి
సమ్ముకానఁ జెప్పితిని సరివచ్చెనా

(॥వని॥)
దక్కినయందాఁకానే తమకించి పై కొందురు
చిక్కితేనేకొనగోరఁ జెనకుదురు
గుక్కక శ్రీవేంకటేశ కూడి నన్నుఁ జూచి(చి?) తివి
చక్కనినావిన్నపము సరివచ్చెనా

(||pallavi||)
vanidala jāḍalu vaddaṁṭe mānaru
sanavu nīvichchinade sarivachchĕnā

(||vani||)
āṁkĕlaguvachchinadām̐kā nāḍuduru mām̐ṭalu
saṁkagulonaidene jaṁkiṁturu
pŏṁkabugŏllĕdalanu bhogiṁchi sūsidivi
saṁkĕdīra nāmāḍa sarivachchĕnā

(||vani||)
nammigai nayaṁdām̐kā navvuduru sĕlavula
sammadiṁchinaṁdumīm̐da sādiṁturu
vummaḍim̐badāruvela nŏḍivaṭṭi sūsidivi
sammugānam̐ jĕppidini sarivachchĕnā

(||vani||)
dakkinayaṁdām̐kāne tamagiṁchi pai kŏṁduru
sikkidenegŏnagoram̐ jĕnaguduru
gukkaga śhrīveṁkaḍeśha kūḍi nannum̐ jūsi(si?) tivi
sakkanināvinnabamu sarivachchĕnā