(॥పల్లవి॥)
వనితకుఁ బతి కిదె వసంతము
దినదినము నమరె తిరుమలమీఁద
(॥వనిత॥)
పుప్పొడి వసంతము పొసఁగె రమణునికి
కప్పురవసంతము కాంతకును
కొప్పెరల నెదురుగఁ గుంకుమ పన్నీరు నించి
కుప్పెలఁ జల్లులాడేరు కోనేటికాడ
(॥వనిత॥)
జవ్వాదివసంతము చతురుఁడు గై కొనె
పువ్వుల వసంతము పొలఁతి కిదె
రవ్వగా బండ్లపై రాసులు వోసుక
నవ్వుతా వేటులాడేరు నడిమించింతాడ
(॥వనిత॥)
గందపు వసంతముఁ గడు శ్రీవేంకటపతి
అందె కస్తూరివసంత మలమేల్మంగ
చిందుచుఁ దట్టుపుణుఁగు చిమ్ముచుఁ గూడాడేరు
సందడి సమరతుల సంపెఁగకాడ
(||pallavi||)
vanidagum̐ badi kidĕ vasaṁtamu
dinadinamu namarĕ tirumalamīm̐da
(||vanida||)
puppŏḍi vasaṁtamu pŏsam̐gĕ ramaṇunigi
kappuravasaṁtamu kāṁtagunu
kŏppĕrala nĕdurugam̐ guṁkuma pannīru niṁchi
kuppĕlam̐ jallulāḍeru koneḍigāḍa
(||vanida||)
javvādivasaṁtamu sadurum̐ḍu gai kŏnĕ
puvvula vasaṁtamu pŏlam̐ti kidĕ
ravvagā baṁḍlabai rāsulu vosuga
navvudā veḍulāḍeru naḍimiṁchiṁtāḍa
(||vanida||)
gaṁdabu vasaṁtamum̐ gaḍu śhrīveṁkaḍabadi
aṁdĕ kastūrivasaṁta malamelmaṁga
siṁdusum̐ daṭṭubuṇum̐gu simmusum̐ gūḍāḍeru
saṁdaḍi samaradula saṁpĕm̐gagāḍa