వనిత నీ పతి నేఁడె వచ్చీఁగాక
(॥పల్లవి॥)
వనిత నీ పతి నేఁడె వచ్చీఁగాక
మనసులోని వలపు మలయుచుండఁగను
(॥వని॥)
దప్పిదేరే వదియేమే తరుణి నీ నింతలోనే
చిప్పిలుమోవితేనెలు చిమ్మిరేఁగఁగా
కప్పినకాఁకలతోడ కడువసివాడే వదియేమే
కప్పురపునగవులు కలిగుండఁగాను
(॥వని॥)
వుమ్మగిలే విదియేమే వువిద నీవూరుపుల-
తెమ్మెరలచలువలు తెటపడఁగా
కుమ్మరింపుఁజెమటలు కురిసేవు నీ విదియేమే
కమ్మి చూపుచాతకాలు కలిగివుండఁగను
(॥వని॥)
వీడిననెరిచీఁకటి వెలఁదిరో నించేవేమే
తోడనే మోముకళలూ తొలఁకఁగాను
అడనె శ్రీవేంకటేశుఁ డప్పుడే నిన్నుఁ గూడె
యేడాలేనిమఱపేలే యింపు నీకుండఁగను
(||pallavi||)
vanida nī padi nem̐ḍĕ vachchīm̐gāga
manasuloni valabu malayusuṁḍam̐ganu
(||vani||)
dappidere vadiyeme taruṇi nī niṁtalone
sippilumovidenĕlu simmirem̐gam̐gā
kappinagām̐kaladoḍa kaḍuvasivāḍe vadiyeme
kappurabunagavulu kaliguṁḍam̐gānu
(||vani||)
vummagile vidiyeme vuvida nīvūrubula-
tĕmmĕralasaluvalu tĕḍabaḍam̐gā
kummariṁpum̐jĕmaḍalu kurisevu nī vidiyeme
kammi sūbusādagālu kaligivuṁḍam̐ganu
(||vani||)
vīḍinanĕrisīm̐kaḍi vĕlam̐diro niṁcheveme
toḍane momugaḽalū tŏlam̐kam̐gānu
aḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍappuḍe ninnum̐ gūḍĕ
yeḍālenimaṟabele yiṁpu nīguṁḍam̐ganu