Vanida littayidenu valasi vatturu neegu

వనిత లిట్టయితేను వలచి వత్తురు నీకు
Language

(॥పల్లవి॥)
వనిత లిట్టయితేను వలచి వత్తురు నీకు
ఘనుఁడవు మేలు మేలు కంటిమిగా గుణము

(॥వని॥)
వంచినశిరసుతోడ వాలినట్టితురుముతో
కుంచె నీకు విసరేటికోమలిఁ జూచి
మంచముమీఁదికిఁ దీసి మన్నించితి వన్నిటాను
అంచె నాఁటదానిగోడు ఆలించితిగా

(॥వని॥)
కమ్మర నాసలతోడ కారేటి చెమటతోను
చమ్మాళిగెలు వట్టినసతిఁ జూచి
కమ్మి పచ్చడము గప్పి కరుణించితి వన్నిటా
నెమ్మి నింతులపయ్యెద నీకుఁ గద్దుగా

(॥వని॥)
వాలుకచూపులతోడ వడి నిట్టూరుపులతో
కాళాఁజి వట్టినసతిఁ గలసితివి
మేలిమి శ్రీవేంకటేశ మించ నన్నుఁ గూడితివి
యీలీల సతులవలపియ్యకొంటిగా

(||pallavi||)
vanida liṭṭayidenu valasi vatturu nīgu
ghanum̐ḍavu melu melu kaṁṭimigā guṇamu

(||vani||)
vaṁchinaśhirasudoḍa vālinaṭṭidurumudo
kuṁchĕ nīgu visareḍigomalim̐ jūsi
maṁchamumīm̐digim̐ dīsi manniṁchidi vanniḍānu
aṁchĕ nām̐ṭadānigoḍu āliṁchidigā

(||vani||)
kammara nāsaladoḍa kāreḍi sĕmaḍadonu
sammāḽigĕlu vaṭṭinasadim̐ jūsi
kammi pachchaḍamu gappi karuṇiṁchidi vanniḍā
nĕmmi niṁtulabayyĕda nīgum̐ gaddugā

(||vani||)
vālugasūbuladoḍa vaḍi niṭṭūrubulado
kāḽām̐ji vaṭṭinasadim̐ galasidivi
melimi śhrīveṁkaḍeśha miṁcha nannum̐ gūḍidivi
yīlīla sadulavalabiyyagŏṁṭigā