వలచిన యాఁటదాని వద్దంటే దోసముగాదా
(॥పల్లవి॥)
వలచిన యాఁటదాని వద్దంటే దోసముగాదా
వెలలేని మన్ననల వెలయించరాదా
(॥వల॥)
సేసకొప్పువంచి మొక్కి చెలి యెదుట నున్నది
ఆసతోఁ గాఁగిట నించి యలమరాదా
రాసికెక్క ముత్యాల యారతి నీకు నెత్తీని
వాసి వన్నెతోడ నాపె వద్దఁబెట్టుకోరాదా
(॥వల॥)
కంకణాల చేతులను కానుక నీకు నిచ్చీని
అంకెలను గారవించి యందుకోరాదా
సుంకుమోవ నవ్వు నవ్వి చుట్టరికాలు చూపీని
పొంకముగా నాపె తోడి పొందు సేయరాదా
(॥వల॥)
వినయాన మోవితేనెవిందు నీకుఁ జెప్పీని
చెనకుచుఁ గాఁపురాలు సేయరాదా
యెనసితివి శ్రీవేంకటేశ నన్ను నింతలోనె
మనిసిచ్చి యాపెతోడ మాఁటలాడరాదా
(||pallavi||)
valasina yām̐ṭadāni vaddaṁṭe dosamugādā
vĕlaleni mannanala vĕlayiṁcharādā
(||vala||)
sesagŏppuvaṁchi mŏkki sĕli yĕduḍa nunnadi
āsadom̐ gām̐giḍa niṁchi yalamarādā
rāsigĕkka mutyāla yāradi nīgu nĕttīni
vāsi vannĕdoḍa nābĕ vaddam̐bĕṭṭugorādā
(||vala||)
kaṁkaṇāla sedulanu kānuga nīgu nichchīni
aṁkĕlanu gāraviṁchi yaṁdugorādā
suṁkumova navvu navvi suṭṭarigālu sūbīni
pŏṁkamugā nābĕ toḍi pŏṁdu seyarādā
(||vala||)
vinayāna movidenĕviṁdu nīgum̐ jĕppīni
sĕnagusum̐ gām̐purālu seyarādā
yĕnasidivi śhrīveṁkaḍeśha nannu niṁtalonĕ
manisichchi yābĕdoḍa mām̐ṭalāḍarādā