వలదనేమా మిమ్ము వట్టి సట లేలయ్య
(॥పల్లవి॥)
వలదనేమా మిమ్ము వట్టి సట లేలయ్య
తలకొనెఁ దమకము తడవేల యిఁకను
(॥వల॥)
మొనసి మీరిద్దరును మోములు చూచుకొంటిరి
ననుపులు సమకూడ నవ్వుకొంటిరి
పెనఁగుచు వలపులు పెంచుకొందురుగాక
పనిలేనిసిగ్గులు పడనేల యిఁకను
(॥వల॥)
పిలువక వచ్చి యొక్కపీఁటపైఁ గూచుంటిరి
చెలరేఁగి వావులు చెప్పుకొంటిరి
వులివచ్చిరతులలొ నోలలాడుదురుగాక
మలకలమతకపుమరఁగేల యిఁకను
(॥వల॥)
కడుఁజుట్టకరిముతోఁ గాఁగిలించుకొంటిరి
విడియాలు నందుకొని వేసుకొంటిరి
అడరి శ్రీవేంకటేశ యప్పుడే నన్నేలితివి
నడుమ నాపెతోడిసన్నలూనేల యిఁకను
(||pallavi||)
valadanemā mimmu vaṭṭi saḍa lelayya
talagŏnĕm̐ damagamu taḍavela yim̐kanu
(||vala||)
mŏnasi mīriddarunu momulu sūsugŏṁṭiri
nanubulu samagūḍa navvugŏṁṭiri
pĕnam̐gusu valabulu pĕṁchugŏṁdurugāga
panilenisiggulu paḍanela yim̐kanu
(||vala||)
piluvaga vachchi yŏkkabīm̐ṭabaim̐ gūsuṁṭiri
sĕlarem̐gi vāvulu sĕppugŏṁṭiri
vulivachchiradulalŏ nolalāḍudurugāga
malagalamadagabumaram̐gela yim̐kanu
(||vala||)
kaḍum̐juṭṭagarimudom̐ gām̐giliṁchugŏṁṭiri
viḍiyālu naṁdugŏni vesugŏṁṭiri
aḍari śhrīveṁkaḍeśha yappuḍe nannelidivi
naḍuma nābĕdoḍisannalūnela yim̐kanu