Valabulagu gurainavaamde mannimcheem gaaga

వలపులకు గురైనవాఁడే మన్నించీఁ గాక
Language

(॥పల్లవి॥)
వలపులకు గురైనవాఁడే మన్నించీఁ గాక
చెలులతో దూరి దూరి చెప్పఁగనేమిటికి

(॥॥)
తలపోఁతలే నాకు తమకమురేఁచఁ గాను
వెలినున్న చిలుకతో విసుగనేలే
పలునాచూపులె నన్ను భ్రమయించఁ జేయఁ గాను
కలువల నిటు దూరఁ గారణమేమిటికి

(॥॥)
జవ్వనమదమె నాకు చవులు వుట్టించఁ గాను
ఇవ్వలఁ బున్నమచంద్రుఁడేమి సేసునే
నివ్వటిల్ల నాయాసలే నివ్వెరగు నొందించఁ గా
పువ్వువిలుతునితోడఁ బోరాడవలెనా

(॥॥)
కమ్మి శ్రీవేంకటేశుఁడే కాఁగిటిలో నుండఁగాను
కొమ్మలాల చలిగాలిఁ గొసరేదేమే
నిమ్మపండ్లంతలై నిక్కి చన్నులు రాఁగా-
నిమ్ముల నాభాగ్యము నెంచిచెప్పవలెనా

(||pallavi||)
valabulagu gurainavām̐ḍe manniṁchīm̐ gāga
sĕlulado dūri dūri sĕppam̐ganemiḍigi

(||||)
talabom̐tale nāgu tamagamurem̐sam̐ gānu
vĕlinunna silugado visuganele
palunāsūbulĕ nannu bhramayiṁcham̐ jeyam̐ gānu
kaluvala niḍu dūram̐ gāraṇamemiḍigi

(||||)
javvanamadamĕ nāgu savulu vuṭṭiṁcham̐ gānu
ivvalam̐ bunnamasaṁdrum̐ḍemi sesune
nivvaḍilla nāyāsale nivvĕragu nŏṁdiṁcham̐ gā
puvvuviludunidoḍam̐ borāḍavalĕnā

(||||)
kammi śhrīveṁkaḍeśhum̐ḍe kām̐giḍilo nuṁḍam̐gānu
kŏmmalāla saligālim̐ gŏsaredeme
nimmabaṁḍlaṁtalai nikki sannulu rām̐gā-
nimmula nābhāgyamu nĕṁchisĕppavalĕnā