Valabu siggeṟamgadu vadi nemiseyavachchu

వలపు సిగ్గెఱఁగదు వడి నేమిసేయవచ్చు
Language

(॥పల్లవి॥)
వలపు సిగ్గెఱఁగదు వడి నేమిసేయవచ్చు
అలసి యాడికలకుఁ గలఁగదు మనసు

(॥వల॥)
పిలిచి నీవైతేను ప్రియములు చెప్పే నాపెకు
చెలి నిన్నాడేమాటైతేఁ జెప్పరాదు
బలిమి నిందులకెల్లా పడిగెమట నీమోవి
వెలయ నీకిది విని విరుగదు మనసు

(॥వల॥)
అడుగులకు మడుఁగు లటు నీవు వరచేవు
బడి నాపెగర్వమైతే పట్టరాదు
అడరి నీవు రాఁగాను ఆపె పాన్పుపై నున్నది
చిడుముడు నిది చూచీఁ జెదరదు మనసు

(॥వల॥)
నిగిడి మొగమోటలు నీవు నడపేవుగాని
తగ నాపెపంతాలైతేఁ దలఁచరాదు
నగుతా శ్రీవేంకటేశ నన్ను నిట్టె గూడితివి
తగిలి నీ కాపెరతిఁ తనియదు మనసు

(||pallavi||)
valabu siggĕṟam̐gadu vaḍi nemiseyavachchu
alasi yāḍigalagum̐ galam̐gadu manasu

(||vala||)
pilisi nīvaidenu priyamulu sĕppe nābĕgu
sĕli ninnāḍemāḍaidem̐ jĕpparādu
balimi niṁdulagĕllā paḍigĕmaḍa nīmovi
vĕlaya nīgidi vini virugadu manasu

(||vala||)
aḍugulagu maḍum̐gu laḍu nīvu varasevu
baḍi nābĕgarvamaide paṭṭarādu
aḍari nīvu rām̐gānu ābĕ pānpubai nunnadi
siḍumuḍu nidi sūsīm̐ jĕdaradu manasu

(||vala||)
nigiḍi mŏgamoḍalu nīvu naḍabevugāni
taga nābĕbaṁtālaidem̐ dalam̐sarādu
nagudā śhrīveṁkaḍeśha nannu niṭṭĕ gūḍidivi
tagili nī kābĕradim̐ taniyadu manasu