వలపు నిలుపలేవు వట్టిబీరాలే కాని
(॥పల్లవి॥)
వలపు నిలుపలేవు వట్టిబీరాలే కాని
నలువంక చూచేవు నయమేదే యిందుకు
(॥వల॥)
తప్పకచూచినందుకు తలవంచుకుండేవు
చప్పుడుగా కతనితో సంగతా యిది
వోప్పుగా నౌననవలె నొండెఁ గాదనవలెను
కుప్పళించేవు చెమట గురుతేదే ఇందుకు
(॥వల॥)
చేయిపట్టి తియ్యఁగాను సిగ్గులువడి వుండేవు
పాయపువిభుఁనితోడ పంతమా ఇది
యీయకోవలె నొండెఇచ్చలాడవలే నొండె
మోయిచు నుస్సురనేవు మొదలేదే ఇందుకు
(॥వల॥)
మోవి నీకు నియ్యఁగాను ముచ్చటలాడవచ్చేవు
శ్రీ వేంకటేశ్వరుతోడ చెల్లునా ఇది
భావించి యీతఁడే కూడె పై కొనఁగవలె నొండె
సేవసేయవలె నొండె సేసేదేమే ఇందుకు
(||pallavi||)
valabu nilubalevu vaṭṭibīrāle kāni
naluvaṁka sūsevu nayamede yiṁdugu
(||vala||)
tappagasūsinaṁdugu talavaṁchuguṁḍevu
sappuḍugā kadanido saṁgadā yidi
voppugā naunanavalĕ nŏṁḍĕm̐ gādanavalĕnu
kuppaḽiṁchevu sĕmaḍa gurudede iṁdugu
(||vala||)
seyibaṭṭi tiyyam̐gānu sigguluvaḍi vuṁḍevu
pāyabuvibhum̐nidoḍa paṁtamā idi
yīyagovalĕ nŏṁḍĕichchalāḍavale nŏṁḍĕ
moyisu nussuranevu mŏdalede iṁdugu
(||vala||)
movi nīgu niyyam̐gānu muchchaḍalāḍavachchevu
śhrī veṁkaḍeśhvarudoḍa sĕllunā idi
bhāviṁchi yīdam̐ḍe kūḍĕ pai kŏnam̐gavalĕ nŏṁḍĕ
sevaseyavalĕ nŏṁḍĕ sesedeme iṁdugu