Valabu mogasaadainavaarigi nittegaadaa

వలపు మొగచాటైనవారికి నిట్టేకాదా
Language

(॥పల్లవి॥)
వలపు మొగచాటైనవారికి నిట్టేకాదా
నెలకొన్న దొరవుగా నీ వేమిసేతువు

(॥వల॥)
విచ్చలపుజవరాలు నీవద్దనే వుండఁగాను
మచ్చికతోడనే మాటలాడేవు
ఇచ్చగించి వీడెము నీకియ్యఁ గాచుకుండఁగాను
పచ్చిదే నాచన్నులపైఁ జేయివేసేవు

(॥వల॥)
చనవరినీదేవులు సరసములాడఁగాను
ననుపున నన్నుఁ జూచి నవ్వు నవ్వేవు
వినయముతో నాపె విందు నీకుఁ జెప్పఁగాను
మొనసి నీ విపుడు నామోవి యడిగేవు

(॥వల॥)
పెండిలాడినాపె నాతోఁ బెనఁగుతా నుండఁగాను
అండనే నన్నుఁ గూడి ఆదరించేవు
నిండుకొన్న మచ్చికలు నీపై నారటిల్లఁగాను
కొండలశ్రీవేంకటేశ కోరి నన్ను మెచ్చేవు

(||pallavi||)
valabu mŏgasāḍainavārigi niṭṭegādā
nĕlagŏnna dŏravugā nī vemiseduvu

(||vala||)
vichchalabujavarālu nīvaddane vuṁḍam̐gānu
machchigadoḍane māḍalāḍevu
ichchagiṁchi vīḍĕmu nīgiyyam̐ gāsuguṁḍam̐gānu
pachchide nāsannulabaim̐ jeyivesevu

(||vala||)
sanavarinīdevulu sarasamulāḍam̐gānu
nanubuna nannum̐ jūsi navvu navvevu
vinayamudo nābĕ viṁdu nīgum̐ jĕppam̐gānu
mŏnasi nī vibuḍu nāmovi yaḍigevu

(||vala||)
pĕṁḍilāḍinābĕ nādom̐ bĕnam̐gudā nuṁḍam̐gānu
aṁḍane nannum̐ gūḍi ādariṁchevu
niṁḍugŏnna machchigalu nībai nāraḍillam̐gānu
kŏṁḍalaśhrīveṁkaḍeśha kori nannu mĕchchevu