వలపు లొడిఁగట్టుక వచ్చితి విప్పుడు నీవు
(॥పల్లవి॥)
వలపు లొడిఁగట్టుక వచ్చితి విప్పుడు నీవు
యెలమి నీ యాసోద మింకా నెంత గలదో
(॥వల॥)
కొంగు దాఁకీఁ బతి వద్దఁ గూచుండక ఇటు రావే
ముంగురులు పైఁ బడీని మొక్కఁబోకువే
యెంగిలి సోఁకివచ్చీని యేకతా లే మాడేవే
సంగతెరఁగ వాతఁడు సదరమా నీకు
(॥వల॥)
తమ్మ చెదరులు రాలీ తతిగొని నవ్వకువే
చిమ్ముఁజూపులు నాటీఁ గొచ్చి చూడకువే
చెమ్మఁజెమట లంటీని చెక్కులు నొక్కకువే
యెమ్మెలు సేసేవు ఆతఁ డెంత నీ వెంత
(॥వల॥)
వూరుపులు పైఁ బారీ నొద్ద బండుండకువే
గీరులు కొనీ సొమ్ములు కాఁగిలించకువే
చేరి నన్ను నేలినాఁడు శ్రీవేంకటేశుఁడు తొల్లె
దారకపు నీ బోఁటికి దక్కునా యీతఁడు
(||pallavi||)
valabu lŏḍim̐gaṭṭuga vachchidi vippuḍu nīvu
yĕlami nī yāsoda miṁkā nĕṁta galado
(||vala||)
kŏṁgu dām̐kīm̐ badi vaddam̐ gūsuṁḍaga iḍu rāve
muṁgurulu paim̐ baḍīni mŏkkam̐boguve
yĕṁgili som̐kivachchīni yegadā le māḍeve
saṁgadĕram̐ga vādam̐ḍu sadaramā nīgu
(||vala||)
tamma sĕdarulu rālī tadigŏni navvaguve
simmum̐jūbulu nāḍīm̐ gŏchchi sūḍaguve
sĕmmam̐jĕmaḍa laṁṭīni sĕkkulu nŏkkaguve
yĕmmĕlu sesevu ādam̐ ḍĕṁta nī vĕṁta
(||vala||)
vūrubulu paim̐ bārī nŏdda baṁḍuṁḍaguve
gīrulu kŏnī sŏmmulu kām̐giliṁchaguve
seri nannu nelinām̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu tŏllĕ
dāragabu nī bom̐ṭigi dakkunā yīdam̐ḍu