Valabu gampalam betti vadim dalagettavayya

వలపు గంపలఁ బెట్టి వడిఁ దలకెత్తవయ్య
Language

(॥పల్లవి॥)
వలపు గంపలఁ బెట్టి వడిఁ దలకెత్తవయ్య
యిలనిట్టె యాసొదము యింకా నెంతగలదో

(॥వల॥)
మాటలాడి తనివోదు మగువ నీతోడుత
తాటించి పాదాలొత్తి తనివోదు
కాటుకకన్నులఁ జూచి కమ్మటిఁ దనివోదు
మేటియైనయీపెకు నీమీఁద నెంతమోహమో

(॥వల॥)
ననుపునఁ గవకవనవ్వియునుఁ దనివోదు
తనువుసోఁకఁ బెనంగి తనివోదు
చెనకుచు మెచ్చిమెచ్చి చెక్కునొక్కి తనివోదు
పసివూని యాపెకు నీపై నెంతమోహమో

(॥వల॥)
కలికితనాల నిన్నుఁ గాఁగిలించి తనివోదు
తలిరుమోవి యాని తనివోదు
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
అలమె నిన్నీపెకు నీయందు నెంతమోహమో

(||pallavi||)
valabu gaṁpalam̐ bĕṭṭi vaḍim̐ dalagĕttavayya
yilaniṭṭĕ yāsŏdamu yiṁkā nĕṁtagalado

(||vala||)
māḍalāḍi tanivodu maguva nīdoḍuda
tāḍiṁchi pādālŏtti tanivodu
kāḍugagannulam̐ jūsi kammaḍim̐ danivodu
meḍiyainayībĕgu nīmīm̐da nĕṁtamohamo

(||vala||)
nanubunam̐ gavagavanavviyunum̐ danivodu
tanuvusom̐kam̐ bĕnaṁgi tanivodu
sĕnagusu mĕchchimĕchchi sĕkkunŏkki tanivodu
pasivūni yābĕgu nībai nĕṁtamohamo

(||vala||)
kaligidanāla ninnum̐ gām̐giliṁchi tanivodu
talirumovi yāni tanivodu
yĕlami śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
alamĕ ninnībĕgu nīyaṁdu nĕṁtamohamo