Valabe vennelagaa braduge punnamigaa

వలపే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా
Year
Language

పల్లవి:

వలపే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా
జతగా గడిపే చల్లనీ ఈ రేయి
ఎపుడు ఇటులే నిలవాలి
ఈ కలలే నిజమై విరియాలి

వలపే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా

చరణం 1:

అల్లరి గాలికి నేలకు రాలే
మల్లెను దోసిట దాచావు
అనురాగముతో అల్లిన మాలగ
నీ మెడలోనే నిలిపావు
తోడు నీడ ఐనావు

వలపే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా

చరణం 2:

సోగసు మనసు కానుక చేసి
నాలో సగమై నిలిచావు
సోగసు మనసు కానుక చేసి
నాలో సగమై నిలిచావు
చీకటి వెలుగులు చెరిసగం
పంచుకోనేవు ఏనాడు
ఎదలో ఎదగా ఒదిగావు

వలపే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా
జతగా గడిపే చల్లనీ ఈ రేయి
ఎపుడు ఇటులే నిలవాలి
ఈ కలలే నిజమై విరియాలి
వలపే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా

pallavi:

valabe vĕnnĕlagā braduge punnamigā
jadagā gaḍibe sallanī ī reyi
ĕbuḍu iḍule nilavāli
ī kalale nijamai viriyāli

valabe vĕnnĕlagā braduge punnamigā

saraṇaṁ 1:

allari gāligi nelagu rāle
mallĕnu dosiḍa dāsāvu
anurāgamudo allina mālaga
nī mĕḍalone nilibāvu
toḍu nīḍa aināvu

valabe vĕnnĕlagā braduge punnamigā

saraṇaṁ 2:

sogasu manasu kānuga sesi
nālo sagamai nilisāvu
sogasu manasu kānuga sesi
nālo sagamai nilisāvu
sīgaḍi vĕlugulu sĕrisagaṁ
paṁchugonevu enāḍu
ĕdalo ĕdagā ŏdigāvu

valabe vĕnnĕlagā braduge punnamigā
jadagā gaḍibe sallanī ī reyi
ĕbuḍu iḍule nilavāli
ī kalale nijamai viriyāli
valabe vĕnnĕlagā braduge punnamigā