వక్కణించి చూడ మగవాఁడవు నీవై తేనేమి
(॥పల్లవి॥)
వక్కణించి చూడ మగవాఁడవు నీవై తేనేమి
పక్కన నింతులఁ గంటే పట్టలేవు మనసు
(॥వక్క॥)
మగువ యెవ్వతో తెరమఱఁగునఁ బాడఁగాను
తగిలె నాపెమీఁద నీతలఁపెల్లాను
మొగము చూచితే నెంతమోహింతువో నీవిఁకను
మిగులా నెంచిచూచితే మెత్తన నీమనసు
(॥వక్క॥)
కామిని యెవ్వతో లోన గాలిపడె గాడించఁగ
కామించి యానందానఁ గరఁగితివి
ఆముకొని మేనుమేను నంటితే నెట్టుండుదువో
దీమసాన మరిగితేఁ దిప్పలేవు మనసు
(॥వక్క॥)
సతి యెవ్వతో మెలఁగుచాటునఁ జేయిచాఁచఁగా
రతికెక్కి వేడుకల రమించితివి
ఇతవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
గతియని నమ్మితేను గట్టిది నీమనసు
(||pallavi||)
vakkaṇiṁchi sūḍa magavām̐ḍavu nīvai tenemi
pakkana niṁtulam̐ gaṁṭe paṭṭalevu manasu
(||vakka||)
maguva yĕvvado tĕramaṟam̐gunam̐ bāḍam̐gānu
tagilĕ nābĕmīm̐da nīdalam̐pĕllānu
mŏgamu sūside nĕṁtamohiṁtuvo nīvim̐kanu
migulā nĕṁchisūside mĕttana nīmanasu
(||vakka||)
kāmini yĕvvado lona gālibaḍĕ gāḍiṁcham̐ga
kāmiṁchi yānaṁdānam̐ garam̐gidivi
āmugŏni menumenu naṁṭide nĕṭṭuṁḍuduvo
dīmasāna marigidem̐ dippalevu manasu
(||vakka||)
sadi yĕvvado mĕlam̐gusāḍunam̐ jeyisām̐sam̐gā
radigĕkki veḍugala ramiṁchidivi
idavai śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
gadiyani nammidenu gaṭṭidi nīmanasu