Vaddu vaddu sadi nimta valalam bettagu mimka

వద్దు వద్దు సతి నింత వలలఁ బెట్టకు మిఁక
Language

(॥పల్లవి॥)
వద్దు వద్దు సతి నింత వలలఁ బెట్టకు మిఁక
సుద్దులు చెప్పఁగఁబోతే సూడువట్టును

(॥వద్దు॥)
శిరసువంచినదాని సిగ్గులువడినదాని
వొరసి చెనకఁబోతే వొట్టువెట్టును
మరలి చూచేదాని మాటలాడి దూరేదాని
గరిమఁ గరకరైతే కాతాళించును

(॥వద్దు॥)
కూరిమిచల్లేదాని కొంగువట్టితీసేదాని-
నారసి యడ్డగించితే నద్దలించును
సారెకు నవ్వేదాని సంగడికి వచ్చేదాని
మారుకొని వలదంటే మచ్చరించును

(॥వద్దు॥)
ఆసపడివున్నదాని ఆయములంటేదాని
పాసి యెలయించఁబోతే పంతమాడును
నీసొమ్మయినదాని నేఁడు శ్రీవేంకటేశుఁడ
సేసవెట్టి కూడితివి చెలి నిన్ను మెచ్చును

(||pallavi||)
vaddu vaddu sadi niṁta valalam̐ bĕṭṭagu mim̐ka
suddulu sĕppam̐gam̐bode sūḍuvaṭṭunu

(||vaddu||)
śhirasuvaṁchinadāni sigguluvaḍinadāni
vŏrasi sĕnagam̐bode vŏṭṭuvĕṭṭunu
marali sūsedāni māḍalāḍi dūredāni
garimam̐ garagaraide kādāḽiṁchunu

(||vaddu||)
kūrimisalledāni kŏṁguvaṭṭidīsedāni-
nārasi yaḍḍagiṁchide naddaliṁchunu
sārĕgu navvedāni saṁgaḍigi vachchedāni
mārugŏni valadaṁṭe machchariṁchunu

(||vaddu||)
āsabaḍivunnadāni āyamulaṁṭedāni
pāsi yĕlayiṁcham̐bode paṁtamāḍunu
nīsŏmmayinadāni nem̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍa
sesavĕṭṭi kūḍidivi sĕli ninnu mĕchchunu