వద్దు వద్దు బలిమి వచ్చె మాకుఁ జెలిమి
(॥పల్లవి॥)
వద్దు వద్దు బలిమి వచ్చె మాకుఁ జెలిమి
పెద్దరిక మింతే చాలు పేరడయ్యీఁ జలము
(॥వద్దు॥)
మాటలాడనేలరా మాణిక్యాలు రాలీని
తేటలనీకన్నుల తేలింపే చాలు
వాటము సేయకురా వలపులు మామీఁద
కూటములు చాలకుంటే కొసరలేము
(॥వద్దు॥)
చెక్కులు నొక్కకురా చిత్తమెల్లాఁ జిల్లులై
తక్కరితనాలయెడతాఁకులే చాలు
తొక్కకురా పాదమున తొల్లె అన్నియు నాయ
అక్కడనుండి చెలుల నంపినదే చాలు
(॥వద్దు॥)
నవ్వులు నవ్వకురా నారుకొన బులకించీ
వువ్విళ్లూర సంగడిఁ గూచుండుటే చాలు
రవ్వలాయ మారకపురముచెన్నరాయ నేఁడు
యివ్వల శ్రీ వేంకటాద్రి నిటు నన్ను గూడఁగా
(||pallavi||)
vaddu vaddu balimi vachchĕ māgum̐ jĕlimi
pĕddariga miṁte sālu peraḍayyīm̐ jalamu
(||vaddu||)
māḍalāḍanelarā māṇikyālu rālīni
teḍalanīgannula teliṁpe sālu
vāḍamu seyagurā valabulu māmīm̐da
kūḍamulu sālaguṁṭe kŏsaralemu
(||vaddu||)
sĕkkulu nŏkkagurā sittamĕllām̐ jillulai
takkaridanālayĕḍadām̐kule sālu
tŏkkagurā pādamuna tŏllĕ anniyu nāya
akkaḍanuṁḍi sĕlula naṁpinade sālu
(||vaddu||)
navvulu navvagurā nārugŏna bulagiṁchī
vuvviḽlūra saṁgaḍim̐ gūsuṁḍuḍe sālu
ravvalāya māragaburamusĕnnarāya nem̐ḍu
yivvala śhrī veṁkaḍādri niḍu nannu gūḍam̐gā