వద్దు సుమీ చెప్పితిమి వాసిగల దొరవు
(॥పల్లవి॥)
వద్దు సుమీ చెప్పితిమి వాసిగల దొరవు
ముద్దు ముద్దువలె నీకు మొక్కితి నేను
(॥వద్దు॥)
నిమ్మపంట వేతుఁజుమ్మీ నిందలు గట్టుదుఁజుమ్మీ
యెమ్మెలకు నీవు మమ్ము నేమన్నాను
బొమ్మల జంకింతుఁ జుమీ బూతునఁదిట్టుదుఁజుమీ
చిమ్ముచు నీవేమి మమ్ముఁ జెనకినాను
(॥వద్దు॥)
కడకంటఁ జూతుఁ జుమీ కాఁకలు చల్లుదుఁ జుమీ
వడిగా మావెంట నీవు వచ్చితేను
కొడిమ లెన్నుదుఁ జుమీ కోపాన సాదింతుఁజుమీ
బడలివుందానఁ గొంగు పట్టితేను
(॥వద్దు॥)
జీరవారఁ దీతుఁజుమీసెలవి నవ్వుదుఁ జుమీ
పేరుకొని నీవు మమ్ముఁ బిలిచితేను
యేరా శ్రీవేంకటేశ యేమన్నా మానక కూడి
ఆరీతి నేలితి విఁక నట్టే అవుఁ జుమ్మీ
(||pallavi||)
vaddu sumī sĕppidimi vāsigala dŏravu
muddu mudduvalĕ nīgu mŏkkidi nenu
(||vaddu||)
nimmabaṁṭa vedum̐jummī niṁdalu gaṭṭudum̐jummī
yĕmmĕlagu nīvu mammu nemannānu
bŏmmala jaṁkiṁtum̐ jumī būdunam̐diṭṭudum̐jumī
simmusu nīvemi mammum̐ jĕnaginānu
(||vaddu||)
kaḍagaṁṭam̐ jūdum̐ jumī kām̐kalu salludum̐ jumī
vaḍigā māvĕṁṭa nīvu vachchidenu
kŏḍima lĕnnudum̐ jumī kobāna sādiṁtum̐jumī
baḍalivuṁdānam̐ gŏṁgu paṭṭidenu
(||vaddu||)
jīravāram̐ dīdum̐jumīsĕlavi navvudum̐ jumī
perugŏni nīvu mammum̐ bilisidenu
yerā śhrīveṁkaḍeśha yemannā mānaga kūḍi
ārīdi nelidi vim̐ka naṭṭe avum̐ jummī