వద్దు రావయ్యా యేల వాసులకుఁ బెనఁగేవు
(॥పల్లవి॥)
వద్దు రావయ్యా యేల వాసులకుఁ బెనఁగేవు
యిద్దరూ నిట్లా నుంటే యేమనఁగఁగలము
(॥పద్దు॥)
పాయలకు వచ్చి సతి సరసములాడఁగాను
యీయెడఁబరాకు నీవేల సేసేవు
చేయిపట్టు కిందాఁకా చెలిని వేఁడుకొంటిమి
చాయల వేఁడుకో నీతో సారె నిఁ(ని?) కా వలెనా
(॥పద్దు॥)
యెట్టకేల కాపె నీతో నిటు మాటలాడుఁగాను
గుట్టెతోడ నీవేల కొంకఁజూచేవు
మట్టున నిందాఁకా నాపెమంకులు దెలిపితిమి
తిట్టపెట్టి నీమంకు తెలుపఁగవలెనా
(॥పద్దు॥)
తమకించి ఆపె నిన్నుఁ దగిలి కాఁగిలించఁగా
చెమటమేనితోడ సిగ్గులువడేవు
అమర శ్రీవేంకటేశ ఆపె నింతకుఁ దెచ్చితిమి
వుమురుకూటపునిన్ను నొడఁబరచేదా
(||pallavi||)
vaddu rāvayyā yela vāsulagum̐ bĕnam̐gevu
yiddarū niṭlā nuṁṭe yemanam̐gam̐galamu
(||paddu||)
pāyalagu vachchi sadi sarasamulāḍam̐gānu
yīyĕḍam̐barāgu nīvela sesevu
seyibaṭṭu kiṁdām̐kā sĕlini vem̐ḍugŏṁṭimi
sāyala vem̐ḍugo nīdo sārĕ nim̐(ni?) kā valĕnā
(||paddu||)
yĕṭṭagela kābĕ nīdo niḍu māḍalāḍum̐gānu
guṭṭĕdoḍa nīvela kŏṁkam̐jūsevu
maṭṭuna niṁdām̐kā nābĕmaṁkulu dĕlibidimi
tiṭṭabĕṭṭi nīmaṁku tĕlubam̐gavalĕnā
(||paddu||)
tamagiṁchi ābĕ ninnum̐ dagili kām̐giliṁcham̐gā
sĕmaḍamenidoḍa sigguluvaḍevu
amara śhrīveṁkaḍeśha ābĕ niṁtagum̐ dĕchchidimi
vumurugūḍabuninnu nŏḍam̐barasedā