Vaddani toyamgaraadu vadim damagimcharaadu

వద్దని తోయఁగరాదు వడిఁ దమకించరాదు
Language

(॥పల్లవి॥)
వద్దని తోయఁగరాదు వడిఁ దమకించరాదు
సుద్దులెల్లాఁ జెప్పి చెప్పి చొక్కించీ నితఁడు

(॥వద్ద॥)
చనుఁగవ లంటవచ్చి జారఁదోసీఁబయ్యద
వినయపుమాఁటలను వేఁడుకొనీని
చెనకి చెక్కులు నొక్కి చిరునవ్వు నవ్వీని
యెనగొని చుట్టరికా లెంతసేసీ నితఁడు

(॥వద్ద॥)
పొందులు సారెకుఁ జేసి బుజముపైఁ జేయివేసి
విందులుగా మోవి యిచ్చీ వేడుకతోను
గందము పైఁ జల్లీని కనుసన్నలు చూపీని
సందడి రతుల కెంత చవిరేఁచీ నితఁడు

(॥వద్ద॥)
చేరి కాఁగిలించీని చేతికి బాగాలిచ్చీ
నేరుపు లెల్లాఁ జూపీ నేఁడు నాతోను
యారీతి శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్నుఁ గూడె
గారవించి మరీ నెంత కరుణించీ నితఁడు

(||pallavi||)
vaddani toyam̐garādu vaḍim̐ damagiṁcharādu
suddulĕllām̐ jĕppi sĕppi sŏkkiṁchī nidam̐ḍu

(||vadda||)
sanum̐gava laṁṭavachchi jāram̐dosīm̐bayyada
vinayabumām̐ṭalanu vem̐ḍugŏnīni
sĕnagi sĕkkulu nŏkki sirunavvu navvīni
yĕnagŏni suṭṭarigā lĕṁtasesī nidam̐ḍu

(||vadda||)
pŏṁdulu sārĕgum̐ jesi bujamubaim̐ jeyivesi
viṁdulugā movi yichchī veḍugadonu
gaṁdamu paim̐ jallīni kanusannalu sūbīni
saṁdaḍi radula kĕṁta savirem̐sī nidam̐ḍu

(||vadda||)
seri kām̐giliṁchīni sedigi bāgālichchī
nerubu lĕllām̐ jūbī nem̐ḍu nādonu
yārīdi śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannum̐ gūḍĕ
gāraviṁchi marī nĕṁta karuṇiṁchī nidam̐ḍu