వద్దనేమో నేము నిన్ను వట్టి సట వొద్దుగాక
(॥పల్లవి॥)
వద్దనేమో నేము నిన్ను వట్టి సట వొద్దుగాక
బుద్దు లాతనికిఁ జెప్పి బోదించగాను
(॥వద్ద॥)
పంతమేల పలికేవే పడఁతీ
అంతే కలితే పతితో నాడుకొనవే
వంతుకేల పెనఁగేవే వాడలోనను
చెంత నాతనికే యింకా సేసగా వలవవే
(॥వద్ద॥)
వరగ నీపగ టెంతపచారించేవే
సొరిది నాతనికే చూపవే నీవు
మురిపెములేఁటికి నాముందరను
మరిగినదాఁకాను నీమగనిఁ జోక్కించవే
(॥వద్ద॥)
నన్నునేల కొసరేవే నడుమ నీవు
అన్నీ నాతని నీవే యడుగఁగదే
యిన్నిటా శ్రీవేంకటేశుఁ డేలి నాకుఁ జనవిచ్చె
యెన్నటిపొందులో నీవూ నెఱిఁగించుకొనవే
(||pallavi||)
vaddanemo nemu ninnu vaṭṭi saḍa vŏddugāga
buddu lādanigim̐ jĕppi bodiṁchagānu
(||vadda||)
paṁtamela paligeve paḍam̐tī
aṁte kalide padido nāḍugŏnave
vaṁtugela pĕnam̐geve vāḍalonanu
sĕṁta nādanige yiṁkā sesagā valavave
(||vadda||)
varaga nībaga ṭĕṁtabasāriṁcheve
sŏridi nādanige sūbave nīvu
muribĕmulem̐ṭigi nāmuṁdaranu
mariginadām̐kānu nīmaganim̐ jokkiṁchave
(||vadda||)
nannunela kŏsareve naḍuma nīvu
annī nādani nīve yaḍugam̐gade
yinniḍā śhrīveṁkaḍeśhum̐ ḍeli nāgum̐ janavichchĕ
yĕnnaḍibŏṁdulo nīvū nĕṟim̐giṁchugŏnave