Vaddanemaa taane maado vachchi vodambaraside

వద్దనేమా తానే మాతో వచ్చి వొడఁబరచితే
Language

(॥పల్లవి॥)
వద్దనేమా తానే మాతో వచ్చి వొడఁబరచితే
ఇద్దరికిఁ దానే మూల మిన్నిటికిఁ గదవే

(॥వద్ద॥)
తెగరానిమంకులకు తెలిపిచెప్పుట మేలు
తగులైనయెడకు నాదరించం బాడి
పగ సాదించరానిచో పక్కనఁ గూర్చుట దగు
తగవులు మాలో మాకు తానే తేర్చఁదగునే

(॥వద్ద॥)
అదలించరానివారి నట్టె వేఁడుకొంటే నీతి
సుదతులవాదు దీర్చుట సంగతి
వదలరానివారినెవ్వగా మాన్పుట పుణ్యము
పొదిగి తానే మమ్ము బోదించఁదగునే

(॥వద్ద॥)
మచ్చరపుసవతుల మట్టుపెట్టుట మంచిది
యెచ్చినవాసికత్తెల నేలుట గీర్తి
మచ్చిక నలమేల్మంగమగఁడు శ్రీవేంకటేశుఁ-
డిచ్చ మమ్ముఁగూడి తానే యీడేర్చఁదగునే

(||pallavi||)
vaddanemā tāne mādo vachchi vŏḍam̐baraside
iddarigim̐ dāne mūla minniḍigim̐ gadave

(||vadda||)
tĕgarānimaṁkulagu tĕlibisĕppuḍa melu
tagulainayĕḍagu nādariṁchaṁ bāḍi
paga sādiṁcharāniso pakkanam̐ gūrsuḍa dagu
tagavulu mālo māgu tāne tersam̐dagune

(||vadda||)
adaliṁcharānivāri naṭṭĕ vem̐ḍugŏṁṭe nīdi
sudadulavādu dīrsuḍa saṁgadi
vadalarānivārinĕvvagā mānpuḍa puṇyamu
pŏdigi tāne mammu bodiṁcham̐dagune

(||vadda||)
machcharabusavadula maṭṭubĕṭṭuḍa maṁchidi
yĕchchinavāsigattĕla neluḍa gīrdi
machchiga nalamelmaṁgamagam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍichcha mammum̐gūḍi tāne yīḍersam̐dagune