వద్దనేమా నిన్నును వలపు దాఁచవచ్చునా
(॥పల్లవి॥)
వద్దనేమా నిన్నును వలపు దాఁచవచ్చునా
బుద్దులెల్లా నీకు నేను బోదించేదాననా
(॥వద్ద॥)
సేసకొప్పు వంచివంచి చెలి నీకు మొక్కఁగాను
చేసూటినే నీవేల సిగ్గువడేవు
అసపడి యప్పటి నీఅండ నిలుచుండఁగాను
మూసినముత్యమవై నామోమేమిచూచేవు
(॥వద్ద॥)
చేతులు చాఁచి నీకు చేరి కానుకియ్యఁగా
నాతికి నీవేల సన్నలుసేసేవు
కాతరాన నీదిక్కు కన్నుల నాపె చూడఁగా
యీతల నాతోడుత నేఁటికి నవ్వేవు
(॥వద్ద॥)
సారెకు విన్నాకె గూడి సరసములాడఁగాను
గారవించి నన్నెంత కాఁగిలించేవు
యీరీతి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
మేరమీరి నన్ను నేమి మెచ్చు మెచ్చేవు
(||pallavi||)
vaddanemā ninnunu valabu dām̐savachchunā
buddulĕllā nīgu nenu bodiṁchedānanā
(||vadda||)
sesagŏppu vaṁchivaṁchi sĕli nīgu mŏkkam̐gānu
sesūḍine nīvela sigguvaḍevu
asabaḍi yappaḍi nīaṁḍa nilusuṁḍam̐gānu
mūsinamutyamavai nāmomemisūsevu
(||vadda||)
sedulu sām̐si nīgu seri kānugiyyam̐gā
nādigi nīvela sannalusesevu
kādarāna nīdikku kannula nābĕ sūḍam̐gā
yīdala nādoḍuda nem̐ṭigi navvevu
(||vadda||)
sārĕgu vinnāgĕ gūḍi sarasamulāḍam̐gānu
gāraviṁchi nannĕṁta kām̐giliṁchevu
yīrīdi śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
meramīri nannu nemi mĕchchu mĕchchevu