వద్దనేమా నేము నిన్ను వట్టి దూరులేల దూర
(॥పల్లవి॥)
వద్దనేమా నేము నిన్ను వట్టి దూరులేల దూర
సుద్దులు చెప్పవే నీవూ సోద్యములుగాను
(॥వద్ద॥)
మావద్దఁ గూచుండఁగాను మాటాడితి నతనితో
దేవులవైతే నీవూఁ దెలుసుకొవే
వావులు చెప్పఁగా నే నివ్వల సరసమాడితి
చేవల్లకు వచ్చి నీవు చెవులారా వినవే
(॥వద్ద॥)
చెనకఁగా నే నితనిచెలిమి సేసితి విట్టె
పనిగలితే నీవూఁ జూపవే మోము
ననుపుగా నవ్వఁగాను నాఁటఁ జన్నులనొత్తితి
మనసొక్కటిగా నీవూ మళ్లిమళ్లి చూడవే
(॥వద్ద॥)
సన్నసేయఁగా నితని సమరతులఁ జొక్కితి
మున్నె పొఁదైతే నీవూ మొక్కు మొక్కవే
యిన్నిటా శ్రీవేంకటేశుఁ డిల నన్ను మన్నించె
యెన్నఁగా నీవు మమ్ము నిద్దరిఁ బొగడవే
(||pallavi||)
vaddanemā nemu ninnu vaṭṭi dūrulela dūra
suddulu sĕppave nīvū sodyamulugānu
(||vadda||)
māvaddam̐ gūsuṁḍam̐gānu māḍāḍidi nadanido
devulavaide nīvūm̐ dĕlusugŏve
vāvulu sĕppam̐gā ne nivvala sarasamāḍidi
sevallagu vachchi nīvu sĕvulārā vinave
(||vadda||)
sĕnagam̐gā ne nidanisĕlimi sesidi viṭṭĕ
panigalide nīvūm̐ jūbave momu
nanubugā navvam̐gānu nām̐ṭam̐ jannulanŏttidi
manasŏkkaḍigā nīvū maḽlimaḽli sūḍave
(||vadda||)
sannaseyam̐gā nidani samaradulam̐ jŏkkidi
munnĕ pŏm̐daide nīvū mŏkku mŏkkave
yinniḍā śhrīveṁkaḍeśhum̐ ḍila nannu manniṁchĕ
yĕnnam̐gā nīvu mammu niddarim̐ bŏgaḍave