వద్దనే వారెవ్వరు వలపు నీకుఁ గలితే
(॥పల్లవి॥)
వద్దనే వారెవ్వరు వలపు నీకుఁ గలితే
పెద్దరికముతోడనే పెండ్లాడరాదా
(॥వద్ద॥)
సారెకు నాతనితోను సరసము లేమాడేవు
కోరికైతే గాఁగిలించుకొనరాదా
తేరకొన మోముచూచి తిమిరి యాఁకారనేల
సారపుటాతనిమోము చవిగొనరాదా
(॥వద్ద॥)
పొసఁగ నితనికెంత పొంచిపొంచి లాచేవు
కొసరు గలితే వద్దఁ గూచుండరాదా
ముసిముసినవ్వులతో మొక్కులు మొక్కఁగనేల
విసవస నాతనిచే విడెమందుకోరాదా
(॥వద్ద॥)
వొల్లనే యంటిముట్టి వూడిగా లేమిసేసేవు
చెల్లుబడైతేఁ జేఁతలు సేయరాదా
యిల్లిదె శ్రీవేంకటేశుఁ డింతలోనే నన్నుఁగూడె
వెల్లవిరి నీవాతని వేఁడుకొనరాదా
(||pallavi||)
vaddane vārĕvvaru valabu nīgum̐ galide
pĕddarigamudoḍane pĕṁḍlāḍarādā
(||vadda||)
sārĕgu nādanidonu sarasamu lemāḍevu
korigaide gām̐giliṁchugŏnarādā
teragŏna momusūsi timiri yām̐kāranela
sārabuḍādanimomu savigŏnarādā
(||vadda||)
pŏsam̐ga nidanigĕṁta pŏṁchibŏṁchi lāsevu
kŏsaru galide vaddam̐ gūsuṁḍarādā
musimusinavvulado mŏkkulu mŏkkam̐ganela
visavasa nādanise viḍĕmaṁdugorādā
(||vadda||)
vŏllane yaṁṭimuṭṭi vūḍigā lemisesevu
sĕllubaḍaidem̐ jem̐talu seyarādā
yillidĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone nannum̐gūḍĕ
vĕllaviri nīvādani vem̐ḍugŏnarādā