Vachchi yemta dadavaaya vanida neevunnaadagu

వచ్చి యెంత దడవాయ వనిత నీవున్నాడకు
Language

(॥పల్లవి॥)
వచ్చి యెంత దడవాయ వనిత నీవున్నాడకు
యిచ్చితివి మన్ననలు యీడేరించవయ్యా

(॥వచ్చి॥)
చుట్టరికములు చెప్పి సుదతి నీకు మొక్కీ
అట్టె నీదండఁ గూచుండఁబెట్టుకొవయ్యా
నెట్టుకొని కానుకగా నిమ్మపండు చేతికిచ్చీ
గుట్టుతోడ నీవందుకొనవయ్యా

(॥వచ్చి॥)
వివరించి సుద్దులెల్లా వెలఁది నిన్నడిగీని
చెవిలో నేకాంతము చెప్పవయ్యా
తివిరి మోవిసన్నలఁ దేనియలు గురిసీని
చవులుకొనుచు నీవు చనవియ్యవయ్యా

(॥వచ్చి॥)
కోరికోరి జవరాలు కొలువులు నీకుఁ జేసీ
నేరువుతోఁ గాగిట నించవయ్యా
చేరి పూనితి వింతలో శ్రీవేంకటేశుఁడ నీవే
సారె నిన్నీకె చెనకీ సరసమాడవయ్యా

(||pallavi||)
vachchi yĕṁta daḍavāya vanida nīvunnāḍagu
yichchidivi mannanalu yīḍeriṁchavayyā

(||vachchi||)
suṭṭarigamulu sĕppi sudadi nīgu mŏkkī
aṭṭĕ nīdaṁḍam̐ gūsuṁḍam̐bĕṭṭugŏvayyā
nĕṭṭugŏni kānugagā nimmabaṁḍu sedigichchī
guṭṭudoḍa nīvaṁdugŏnavayyā

(||vachchi||)
vivariṁchi suddulĕllā vĕlam̐di ninnaḍigīni
sĕvilo negāṁtamu sĕppavayyā
tiviri movisannalam̐ deniyalu gurisīni
savulugŏnusu nīvu sanaviyyavayyā

(||vachchi||)
korigori javarālu kŏluvulu nīgum̐ jesī
neruvudom̐ gāgiḍa niṁchavayyā
seri pūnidi viṁtalo śhrīveṁkaḍeśhum̐ḍa nīve
sārĕ ninnīgĕ sĕnagī sarasamāḍavayyā