Vachchenu nee ramanumdu vasamtamaadhavumdai

వచ్చెను నీ రమణుఁడు వసంతమాధవుఁడై
Language

(॥పల్లవి॥)
వచ్చెను నీ రమణుఁడు వసంతమాధవుఁడై
ఇచ్చగించి చేకొనవే యెదురేఁగి నీవు

(॥వచ్చె॥)
వూచెఁబో నీ సెలవుల పున్నమ వెన్నెల నవ్వు
కాచెఁబో చన్నుల నిమ్మకసుఁగాయలు
రాచిలుక లెలిఁగించి రమణి నీ పలుకుల
యేచెను వసంతకాల మిదె నీ పాయమున

(॥వచ్చె॥)
చిందెఁబో నీమేన నట్టె చెమటల రసములు
అందెఁబో చేతులకు నీ యాయపుఁజన్ను
మందలాయఁ దుమ్మిదలు మరి నీ తురుమునను
చందపు నీ కోరికలే జాజరవసంతము

(॥వచ్చె॥)
పండెఁబో నీకెమ్మోవిఁ బల్లదొర లింతలోనె
నిండెఁబో చల్లనిగాలి నీ వూర్పుల
అండనె శ్రీ వేంకటేశుఁ డంతలోనె నిన్నుఁ గూడె
బొండుమల్లెపానుపువో పులక జొంపములు

(||pallavi||)
vachchĕnu nī ramaṇum̐ḍu vasaṁtamādhavum̐ḍai
ichchagiṁchi segŏnave yĕdurem̐gi nīvu

(||vachchĕ||)
vūsĕm̐bo nī sĕlavula punnama vĕnnĕla navvu
kāsĕm̐bo sannula nimmagasum̐gāyalu
rāsiluga lĕlim̐giṁchi ramaṇi nī palugula
yesĕnu vasaṁtagāla midĕ nī pāyamuna

(||vachchĕ||)
siṁdĕm̐bo nīmena naṭṭĕ sĕmaḍala rasamulu
aṁdĕm̐bo sedulagu nī yāyabum̐jannu
maṁdalāyam̐ dummidalu mari nī turumunanu
saṁdabu nī korigale jājaravasaṁtamu

(||vachchĕ||)
paṁḍĕm̐bo nīgĕmmovim̐ balladŏra liṁtalonĕ
niṁḍĕm̐bo sallanigāli nī vūrbula
aṁḍanĕ śhrī veṁkaḍeśhum̐ ḍaṁtalonĕ ninnum̐ gūḍĕ
bŏṁḍumallĕbānubuvo pulaga jŏṁpamulu